వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ క్టాస్లతో పెరిగిన డిమాండ్
న్యూస్ మినిట్ కథనం: కొరోనా లాక్ డౌన్ వల్ల సాధారణ వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురి అయ్యారు. ఆ నష్టాల నుంచి వారింకా కోలు కోలేకపోతున్నారు. మరో వంక లాప్ టాప్, టాబ్, స్మార్ట్ ఫోన్ల విక్రయాలు రాకెట్ వేగంతో పెరిగిపోతున్నాయి. డిమాండ్‌ని బట్టి ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయ దుకాణాలు వినియోగదారుల నుంచి ఎక్కువ ధరను వసూలు చేస్తున్నారు. ఆసెర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ దక్షిణాది రాష్ట్రాల జనరల్ మేనేజర్ నవనీద గిరి టిఎన్ఎం ప్రతినిధితో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ఐటి కంపెనీలే కాకుండా, ఇతర సంస్థలు తమ ఉద్యోగులను ఇండ్ల వద్ద నుంచే పని చేయమని కోరడం వల్ల లాక్ డౌన్ నిబంధనలు కూడా అలాగే ఉండటం వల్ల వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతి బాగా పెరిగిందని దాంతో లాప్ టాప్ల డిమాండ్ పేరిగిందని అన్నారు.
దానికి తోడు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఆన్ లైన్ పాఠాలు చెబుతుండటం వల్ల లాప్ టాప్ల డిమాండ్ పెరిగిందని అన్నారు. డిమాండ్ ను బట్టి లాప్ టాప్, టాబ్ లకు ఆర్డర్ ఇస్తున్నారు. జార్జ్ వర్ఘీస్ అనే ఈ కామర్స్ వెబ్ సైట్ గల లాప్ టాప్, టాబ్ లను కొనుగోలు చేసుకున్నారు. తమ పిల్లలిద్దరికీ వారం రోజుల క్రితం 27 వేల రూపాయిల వంతున లాప్ టాప్ లను కొనుగోలు చేశారు.ఇప్పుడు వాటి ధర ఒక్కొక్కటి 37వేలకు పెరిగింది. బిగ్ సీ మేనేజింగ్ డైరక్టర్ బాలు చౌదరి గతంలో 12 వేలు, 13 వేలు ఉండే లాప్ టాప్ టాబ్ ల ధర ఇప్పుడు బాగా పెరిగిందనీ, తమ సంస్థకు దక్షిణ భారతంలో 225 స్టోర్ లను కలిగి దని చెప్పారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు గతంలో రుణాలు బాగా ఇచ్చేవనీ, ఇప్పుడు తగ్గించేశాయని ఆయన చెప్పారు. లాప్ టాప్ ల కన్నా టాబ్ లనే ఎక్కువ మంది కొంటున్నారని శాంసంగ్ తెలుగురాష్ట్రాల మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేందుకు ఇవి అనువుగా ఉండటమే కారణమని అన్నారు. అలాగే, స్మార్ట్ ఫోన్లు, ఇతర విడిభాగాల విక్రయాలు బాగా పెరిగాయని ఆయన చెప్పారు.