Take a fresh look at your lifestyle.

సేవా మూర్తులు

లయన్స్ ‌సేవా మహాసాగరంలో..
ముత్యాల్లాంటి లక్షల లయన్లు
స్నేహానికి చేసిరి పట్టాభిషేకాలు
సమయాన్ని సమాజానికిచ్చే ధీరులు
బడుగులకే ఆత్మబంధువులు
అనాధలకు అమృత గొడుగులు
అవసరార్థులకు ఆపన్న హస్తాలు
రోగులకు చేయూతల లేపనాలు
పేదల పక్షపాత హిత చేతులు
ఆకలిని పారద్రోలే ఉగ్ర సింహాలు !

అజ్ఞానాన్ని తరిమే విజ్ఞానులు
ప్రపంచ శాంతి శ్వేత కపోతాలు
విశ్వ కుటుంబ పునాది రాళ్లు
సరిహద్దులు చెరిపే విశ్వకర్మలు
మానవీతను పోషించే ఘనులు
సంపదల తృణప్రాయ వితరణలు
అసురులను తరిమే అసాధ్యులు
అవయవదాన యజ్ఞం చేసే ఆప్తులు
బతుకుతూ బతికిచ్చే గుణవంతులు
నవ్వుతూ నవ్వులు పంచే దాతలు !

అందరూ బాగుండాలని..
అందులో మనముండాలని..
ఆకాంక్షించే నిస్వార్థ సేవకులు
పరహితమే తన మతమని..
చేతులకు ఎముకలే లేని సేవలు
నరున్ని నారాయణుడిగా మార్చగల..
దివ్య సాధనం సేవయని నమ్మి..
సేవాసంద్రంలో తావమాడుతూ..
హరితవన పరిరక్షణ ఊతకర్రలు
చీకట్లను చిదిమే దృష్టి ప్రదాతలు
లయన్స్ ‌సంస్థ సేవల భాద్యులు !

(లయన్స్ ‌క్లబ్స్ అం‌దించే నిస్వార్థ సేవలకు స్పందనగా అక్షరాభిషేకాలు)
                        – మధుపాళీ
            కరీంనగర్‌,9949700037

Leave a Reply