Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాక్సిన్‌ ఆవిష్కరణతో స్వావలంబన

  • ప్రపంచదేశాలకు భారత్‌ ‌దిక్సూచిగా మారింది
  • ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌వేడుకలకు ప్రధాని శ్రీకారం
  • సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్ముడికి నివాళి
  • దండి పాదయాత్రకు మోడీ పచ్చ జెండా

75వ స్వాతంత్య వేడుకలను పురస్కరించుకుని 75 వారాలపాటు నిర్వహించతలపెట్టిన ’ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌’ ‌కార్యక్రామానికి ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ భారీ కార్యక్రమంలో ’ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌’ ‌వెబ్‌సైట్‌ను లాంచ్‌ ‌చేశారు. అనంతరం సబర్మతి ఆశ్రమం వద్ద జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. దండియాత్ర నిర్వహించి 91 ఏండ్లు అయిన సందర్భంగా చేపట్టిన ఈ పాదయాత్ర కూడా దండి వరకు సాగనుంది. 81 మందితో ప్రారంభమై 25 రోజులపాటు 241 కిలోమీటర్ల మేర యాత్ర జరుగుతుంది. మార్గమధ్యంలో వివిధ వర్గాల ప్రజలు ఈ దండి మార్చ్‌లో భాగస్వామ్యం కానున్నారు.

- Advertisement -

ఈ యాత్రకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ ‌సింగ్‌ ‌పటేల్‌ ‌నేతృత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ ‌స్వయంసమృద్ధి సాధించిందని, దీని వల్ల ప్రపంచ దేశాలకు కూడా ఉపయోగం జరిగిందన్నారు. భారత్‌ ‌సాధించిన ఘనతలన్నీ కేవలం మన దేశానికే కాదు అని, ఆ ఘనతలు యావత్‌ ‌ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని తెలిపారు. స్వయంసమృద్ధితో నిండిన మన దేశ ప్రయాణం.. ప్రపంచ దేశాల అభివృద్ధిని కూడా వేగవంతం చేస్తుందని ప్రధాని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. లోకమాన్య బాలగంగాధర్‌ ‌తిలక్‌ ‌పూర్ణ స్వరాజ్యం పిలుపును మరిచిపోలేమన్నారు.

మంగళ్‌ ‌పాండే, తాంతియా థోపే, రాణీ లక్ష్మీభాయ్‌, ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌భగత్‌ ‌సింగ్‌, ‌పండిట్‌ ‌నెహ్రూ, సర్దార్‌ ‌పటేల్‌, అం‌బేద్కర్‌ ‌లాంటి వారు మనకు ప్రేరణగా నిలిచారన్నారు. దేశ స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు యువత, విద్యావంతులు బాధ్యత తీసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మన దేశం సాధించిన ఘనతను ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నారు. కళలు, సాహిత్యం, నాటక రంగం, చిత్ర పరిశ్రమ, డిజిటల్‌ ఎం‌టర్‌టైన్‌మెంట్‌ ‌రంగాలకు చెందిన వారు స్వాతంత్రోద్యమానికి చెందిన విశిష్టమైన కథలను విస్తృత ప్రచారం చేయాలని ప్రధాని కోరారు. మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఫీలవాలన్నారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాల పట్ల గర్వపడాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిదని, ఆ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.దేశ వైభవోపత చరిత్రను సంరక్షించేందుకు గత ఆరేళ్ల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.

Leave a Reply