Take a fresh look at your lifestyle.

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష

ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ ‌రావు

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్షా అని శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష్‌ ‌రావు  పిలుపునిచ్చారు.  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారు అని.. శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకొని విశ్వాన్ని వినాశనం చేసేలా దాపురించిన మహమ్మారి కొరోనాని మనో ధైర్యంతో తరిమికొడదామని అన్నారు. కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా, కొరోనా నిబంధనలు పాటిస్తూ  జరుపుకోవాలని సూచించారు. ఆలయాల్లో అర్చకులు చేసేది లోక కళ్యాణము,. శ్రీరాముని అనుగ్రహము ప్రజలందరి పై ఉండాలని, అంత శుభం కలగాలని ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ కొరోనా మహమ్మారిని పారదోలుదామని భగవంతున్ని వేడుకున్నారు.

Leave a Reply