Take a fresh look at your lifestyle.

అప్రమత్తతే రక్షణ కవచం

“ఉపాది లేకపేద, మధ్య తరగతి ప్రజల బతుకు దయనీయమైంది. ఇకవలస కూలీల వ్యథఅంతా ఇంతాకాదు. దాంతోపాటు దేశఆర్థిక వ్యవస ్థఅతలాకుతలమైన నేపథ్యంలో ఈసడలింపులు తప్పనిసరి చేస్తూ ఇకభారాన్ని ప్రజలపైనే మోపింది. సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా జనం రోడ్లబాట పట్టడం సహజం. రోజురోజుకు కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ దేశవ్యాప్తంగా లక్ష పైచిలుకు, తెలంగాణ రాష్ట్రంలో 1600 లకు చేరువగా నమోదవుతున్నాయి. కొరోనాకు వ్యాక్సిన్ని కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నప్పటికీ అందుబాటులోకి రావడానికి మరో 6 నెలల నుండి సంవత్సరకాలం పట్టేఅవకాశం ఉన్నట్లు సమాచారం.”

కన్నవారే భారమై వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న ఆధునిక కాలంలో, సంపాదన వెనకాలపడి కుటుంబానికి కొంత సమయం కేటాయించలేక యంత్రంగా మిగిలి పోతున్న కాలంలో, పక్కోడిబాధను చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్టుచేసి లైకులతో సంతృప్త్తి పడుతున్న అమానవీయ ప్రపంచంలో, ఆకాశాన్ని, అగాధాన్ని ఏకం చేయలేనంత పొడసూపిన ఆర్థిక, సామాజిక అసమానతలతో కాలం వెళ్లదీస్తున్న సంక్లిష్ట పరిస్థితుల్లో, ఏ అసమానతలు లేకుండా అందరికీ సమానంగా వ్యాప్తి చెందే కొరోనాతో సహజీవనం చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఈ విపత్కాలంలో సైన్సు ఒక్కటే కొరోనా బాధితులకు వెన్నుదన్నుగా నిలిచిందని, మందు లేకపోయినా శాస్త్రసాంకేతికతను పుణికి పుచ్చుకున్న వైద్యబృందం ముందు చూపుతో కొరోనాను కట్టడి చేయడంలో అహర్నిశలు కృషి సల్పుతుందనే వాస్తవాన్ని గ్రహించాలి. దైవ ధూతలమని, శక్తి స్వరూపులమని చెప్పుకొనే ఏబాబా, స్వామి, ఫకీర్‌, ‌ఫాస్టర్తమ శక్తినంతా ధారబోసి కొరోనాను అంతం చేయకపోగా, కనీసం నోరు మెదపక పోవడం గమనార్హం. ప్రపంచాన్ని స్తంభింపజేసిన కొరోనా వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. క్యూబా లాంటి చిన్నదేశం నిలదొక్కుకొని ఇత• •దేశాలకు మానవీయకోణంలో సేవాదృక్పథంతో తన స్నేహహస్తాన్ని అందిస్తుంటే, అభివృద్ధి చెందిన దేశాలు కొరోనా తాకిడికి తట్టుకోలేక సతమతమవుతున్నాయి. ఆర్థిక• సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విచక్షణను కోల్పోయి ఈవిపత్తుకు ప్రత్యర్థి దేశాన్ని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి తీవ్రమైన లాభాపేక్షతో కూడిన పెట్టుబడిదారీ విధానమే ప్రధాన కారణమని రుజువైంది.

దాదాపు 60 రోజుల లాక్‌డౌన్‌ ‌తర్వాత మరోసారి లాక్‌డౌన్‌ ‌పొడిగించినప్పటికి కంటైన్మెంట్‌ ‌ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాలలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థలు, ఆర్‌.‌టి.సి. మొదలైన వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం కట్టింది. మూడునెలల మారటోరియం కాలం ముగియనుంది. ఉపాది •లేకపేద, మధ్య తరగతి ప్రజల బతుకు దయనీయమైంది. ఇకవల• •కూలీల వ్యథఅంతా ఇంతాకాదు. దాంతోపాటు దేశఆర్థి• •వ్యవస ్థఅతలాకుతలమైన నేపథ్యంలో ఈసడలింపులు తప్పనిసరి చేస్తూ ఇకభారాన్ని ప్రజలపైనే మోపింది. సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా జనం రోడ్లబాట పట్టడం సహజం. రోజురోజుకు కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ దేశవ్యాప్తంగా లక్ష పైచిలుకు, తెలంగాణ రాష్ట్రంలో 1600 లకు చేరువగా నమోదవుతున్నాయి. కొరోనాకు వ్యాక్సిన్ని కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నప్పటికీ అందు బాటులోకి రావడానికి మరో 6 నెలల నుండి సంవత్సరకాలం పట్టేఅవకాశం ఉన్నట్లు సమాచారం. కొరోనా రూపాంతరం చెందుతున్న తరుణంలో వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి• వచ్చినా పూర్తిస్థాయిలో నిర్మూలన సాధ్యం కాకపోవచ్చనే వాదనలు వినవస్తున్నాయి. ఇన్ని రోజులు లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తూ స్వీయ నిర్బంధంతో మనల్ని, మన కుటుంబాలని మహమ్మారి బారిన పడకుండా రక్షించుకున్నాం. ఇప్పుడు జనజీవనం సాధారణమైన పరిస్థితిలో, ఉపాధికోసం రోడ్డెక్కక తప్పని పరిస్థితిలో స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణలే మనకు రక్షణ కవచాలుగా నిలువనున్నాయి. సడలింపులు ఇచ్చింది ప్రభుత్వమే కాని కొరోనా కాదనే విషయాన్ని గుర్తెరగాలి.కొరోనా సోకినా వ్యాధి లక్షణాలు బయటపడకపోవడం వల ్లఅతని ద్వారా మరింతమందికి ఆవ్యాధి సోకే అవకాశాలు మెండు. అందుకే మరింత జాగ్రత్తలు పాటిం చాల్సిన అవసరం ఉంది.

ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఒ.) ఎమర్జెన్సీస్‌ ఎక్స్‌పర్ట్ ‌మైక్‌ర్యాన్‌ ‌జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ కొరోనా వైరస్‌ ఎప్పటికీ అంతం కాకపోవచ్చు. అది హెచ్‌.ఐ.‌వి మాదిరిగా మరో ఎండెమిక్‌ ‌డిసీజ్‌గా మారొచ్చని చెప్పారు. ప్రస్తుతం కొరోనాపై ప్రపంచానికి కంట్రోల్‌ ‌కొంత మాత్రమే ఉందన్నారు. ఈతరుణంలో భారత• ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ ‌కొంతవరకు ఉపయోగకరంగా ఉండవచ్చు. కొరోనా వైరస్‌ ‌మానవ జాతిని గడగడలాడించడానికి కారణం రోగనిరోధక శక్తి రోజురోజుకు క్షీణిస్తూ ఉండడమే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దీనికి వ్యాయామం తగ్గడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, హైజీనిక్‌ అం‌టూ సున్నితంగా మారడమే ప్రధాన కారణం. ఏది ఏమైనా ఇప్పటికైనా మనం చేస్తున్న తప్పులను ఒకసారి ఏకరువు పెట్టుకొని ఆరోగ్యకరమైన జీవిత విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొరోనాతో సహజీవనం చేయాల్సిన విపత్కర పరిస్థితిలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రతిపౌరుడు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

 1. భౌతిక దూర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
 2. రద్దీగా ఉండే ప్రాంతాలలో పేసు మాస్క్‌ను తప్పని సరిగా ధరించాలి.
 3. పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.
 4. కొరోనా గురించిన వార్తలకు వీలైనంత దూరంగా ఉంటూ, పుకార్లను పట్టించుకోకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండండి.
 5. బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్, ఉం‌గరాలు, చేతివాచి ధరించకపోవడం మంచిది.
 6. చేతి రుమాలుకు బదులుగా సానిటాయిజర్‌, ‌టిష్యు పేపర్‌ ‌దగ్గర ఉంచుకోండి.
 7. బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్ళు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి.
 8. అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చినట్టు గమనిస్తే స్నానం చేయడం మంచిది.
 9. రద్దీగా ఉండే ప్రాంతాలకు, అనవసర సమావేశాలకు, అనవసర• ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది.
 10. అత్యసరమైతే తప్ప వివాహాలకు, ఇతర వేడుకలకు వెళ్లవద్దు.
 11. బయటి ఆహారం తినడం పూర్తిగా నివారించడమే మంచిది.

ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ కొరోనాను సమూలంగా నివారించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మరువ రాదు. ఇప్పటికే సుదీర్ఘలాక్‌డౌన్‌తో ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోయాం. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మళ్లీ ఆపరిస్థితిని కొని తెచ్చుకోకుండా జాగరుకతతో ఉందాం. మానవ మేధస్సు, విచక్షణ ముందు ఏవైరస్‌ ‌నిలువలేదని నిరూపిద్దాం.
గుండు కరుణాకర్‌,
‌వరంగల్‌, 9866899946.

Leave a Reply