భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని మోడీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్ పాయింట్‌ని తెరదరకు తెచ్చారు. ఫేస్‌బుక్‌లో ట్రంప్ నంబర్ వన్ అని తర్వాత మోడీ ఉన్నారని ఆ సంస్థ అధినేత జుకర్‌బర్గ్ తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా ట్రంప్ ఉటంకించారు. త్వరలో తాను భారత్‌లో పర్యటించబోతున్నానని, దానికోసం ఆసక్తిగా వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు.‘‘ఫేస్‌బుక్‌లో డొనాల్డ్ ట్రంప్ నెంబర్ వన్ అని, తర్వాత ప్రధాని మోడీ ఉన్నారని ఇటీవల జుకర్‌బర్గ్ అన్నారు. ఇది గొప్ప గౌరవం అన్నారు. నిజానికి, రెండు వారాల్లో నేను భారత్‌కు వెళ్లబోతున్నాను.