Take a fresh look at your lifestyle.

స్వీయ క్రమశిక్షణే శ్రీరామ రక్ష

వ్యక్తిగత క్రమశిక్షణ, పరిశుభ్రత ముఖ్యం

  • పదోతరగతి పరీక్షలు యథాతథం
  • జనం గుంపులుగా గుమ్మికూడవద్దు
  • ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు
  • విదేశాల నుంచి వచ్చిన వారికే వ్యాధి
  • విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి దవాఖానాల్లో చేర్చాలి
  • గ్రామాల్లో,మండలాల్లో మున్సిపాలిటీల్లో అప్రమత్తంగా ఉండాలి
  • అన్నీ చోట్ల శానిటైజైషన్‌ ‌ముఖ్యం : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

కొరోనా వ్యాధిగురించి  మనం ఎక్కువగా  భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముందు జాగ్రత్తచర్యలే శ్రీరామరక్షగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత శుభ్రత తీసుకుంటే వ్యాధి  వచ్చే అవకాశమేలేదని సూచించారు.రాష్ట్రంలోకి ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నట్లయితే వారిని వెంటనే చికిత్సకోసం దవాఖానాలకు పంపించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లో ఇండోనేషియానుంచి వ్యక్తుల ద్వారాకొరోనా వచ్చిందని తెలియడంతో అప్రమత్తమై హుటాహుటిన కరీంనగర్‌లోచర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకలెక్టర్‌లు, జిల్లా ఎస్‌పీలతో ప్రగతిభవన్‌లో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కొరొనాకోసం కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ప్రజారవాణాను ప్రస్తుతపరిస్థితులలో బంద్‌ ‌చేసే అవకాశం లేదని, అంత ఉత్పాతం,భయం ఉన్నట్లయితే వేగంగా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

వియత్నాం దేశాన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చునని ఉదహరించారు. చైనాకు అతిసమీపంలో ఉన్న వియత్నాంలో కొరోనా ప్రభావం లేనేలేదని వివరించారు. ఆ  దేశం ముందుగా అప్రమత్తమై కఠినంగా వ్యవహరించినందుననే వ్యాధని దేశంలోకి రాకుండా జాగ్రత్తపడ్దారని తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాలను రద్దు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించనున్నారని ఆ సమావేశంలో అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకు 14 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని వీరందరూ చికిత్స పొందుతున్నారని, వీరందరూ కోలుకుంటున్నారని   సీఎం చెప్పారు. ఈ పద్నాలుగు మంది విదేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చినవారేనని, అనేకచోట్ల  తనఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఏదోమార్గంలో రాష్ట్రంలోకి వస్తున్నారని తెలిపారు. ఇటలీ ఇరాన్‌ ‌దేశాలు చాలా నిర్లక్ష్యం చేశాయని అందరే అక్కడ ప్రాణహానీ జరిగిందని సీఎం ఉదహరించారు.

తెలంగాణాలో నివసిస్తున్న ఏ ఒక్క వ్యక్తికి వ్యాధి సోకనేలేదని చెప్పారు.ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకే వ్యాధి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులెవ్వరైనా,గ్రామాలలో, మున్సిపాలిటీలలో కనిపించినా వెంటనే క్వారంటైన్‌ ‌చేయాలని సూచించారు.గ్రామాల్లో పోలీస్‌ అధికారులను నియమించామని, దవాఖానాకు చేరకుండా ఇబ్బందిపెట్టినట్టయితే పోలీసులకు అప్పగించి చికిత్స చేయించాలని చెప్పారు.  జనం గుంపులుగా కూడవద్దని, గుంపులుగా చేరకపోతే వ్యాధి వ్యాపించే అవకాశం ఉండదని తెలిపారు.గ్రామాల్లో, మండలాల్లో, మునిసిపాలిటీల్లో, పబ్లిక్‌సర్వీస్‌ ‌స్థలాల్లో శానిటైజర్‌ ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇవ్వాలని,తద్వారా వ్యాధిని తరిమికొట్టవచ్చునని చెప్పారు.ఈ వ్యాధి భారతదేశంలో పుట్టిన వ్యాధికానేకాదని, ఇతరదేశాలలో పుట్టిన వ్యాధి అనే విషయం మరిచిపోవద్దని చెప్పారు.

- Advertisement -

  ఎస్‌ఎస్‌సీ పరీక్షలు యథాతథం
పదోతరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలు వాయిదా వేయడానికి సుముఖంగా లేరని తెలిపారు. వారంరోజుల్లో పరీక్షలు పూర్తికానున్నాయని చెప్పారు. 2500 కేంద్రాల్లో  5లక్షల మంది పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఆ సెంటర్లలో కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో హై శానిటైజైషన్‌ ‌తీసుకుని తీరాలని, అధికారులను ఆదేశించారు. ప్రతీ విద్యార్ధి శుభ్రతపట్ల శ్రద్దతీసుకోవాలని సూచించారు. పిల్లలు పరీక్షలకోసం పూర్తిగా సిద్ధమై ఉన్నారని, ఇప్పుడు పరీక్షలు రద్దు చేయడం సమర్ధనీయం కాదని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.పరీక్షా కేంద్రాల పరిశుభ్రతకోసం ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రెగ్యులర్‌ ‌బ్లీచింగ్‌ ఉం‌టుందని, శానిటైజైషన్‌ ‌చేస్తారని, పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తారని, విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని  విజ్ఞప్తి చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద కూడా గుంపులుగా గుమ్మికూడకుండా, జాగ్రత్తలు త్ణీసుకోవాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాధి నుంచి రక్షించుకోవడంలో ప్రతీ విద్యార్థి సహకరించాలని కోరారు. ఈ మాత్రం జాగ్త్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఉండవని భరోసానిచ్చారు

 ప్రార్థనామందిరాలు…..
దేవాలయాలు, మసీదులు,చర్చీలు ఇతర ప్రార్థనామందిరాల వద్ద జనం గుమ్మికూడావద్దని పండుగలు, ఉత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలు ఉన్నట్లయితే చాలా తక్కువ సంఖ్యలో కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.దేవాలయా ల అధికారులు, పూజారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని చెప్పారు. ఆలయాలలోకి భక్తులు ఎక్కువ సంఖ్యలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంఘా మసీదులలో సామూహిక ప్రార్ధనలను నిర్వహించవద్దని తద్వారా జనం గుమ్మికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చర్చీలలో ప్రార్థనలలో జనం ఎక్కువ సంఖ్యలో రాకుండా శ్రద్ద తీసుకోవాలని తెలిపారు.

కల్యాణమండపాలు, షాదీఖానాలు బంద్‌
‌కల్యాణమండపాలు, మ్యారేజీ హాల్స్, ఇతర శుభవేదికలన్నింటినీ బంద్‌ ‌చేయాలని ఆదేశించారు. ఈ నెల 31 తేదీ వరకు ఈ నిబంధనల కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అప్పటివరకు ముహూర్తాలను నిర్ణయించుకున్న వారు అతికొద్దిమంది దగ్గరి బంధువులతో  వివాహాలు ఇతర ఉత్సవాలను నిర్వహించాలని, మొత్తం బంధువులు,మిత్రులు 200 మందికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

సీసీఎంబీ ద్వారా పరీక్షలు … కేంద్రాన్ని అనుమతి కోరుతాం
సీసీఎంబీ ద్వారా ఒకేసారి 500 మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నదని అందుకని  కేంద్రాన్ని అనుమతి కోరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడుగుతామని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాలలో నిర్విరామంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.కొరోనా పరీక్షల ఫైనల్‌ ‌రిపోర్డును ఇచ్చే అధికారం కేంద్రానికే ఉన్నదని చెప్పారు.మనరాష్ట్రానికి ఉన్న చత్తీస్‌గఢ్‌, ‌కర్ణాటక, సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చినవాళ్లు వస్తున్నారని, అందుకని విదేశాల నుంచి వచ్చిన వాళ్ల విషయంలో చాలాజాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లను వెంటనే క్వారంటైన్‌ ‌చేయాలని, దవాఖానాలో చూపించాలని చెప్పారు.ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి వచ్చిన వారు దవాఖానాకు వెళ్లనట్లయితే పోలీసుల సాయం తీసుకోవాలని  చెప్పారు.

రాష్ట్ర సరిహద్దులలో 18 చెక్‌పోస్టులు
సరిహద్దులలో 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని ఈ చెక్‌పోస్టులలో ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని వెంటనే పరీక్షిస్తారని చెప్పారు. అనుమానంగా ఉంటే క్వారంటైన్‌ ‌చేస్తారని చెప్పారు.160 దేశాల నుంచి విదేశాలలో ఉన్నవాళ్లు వస్తున్నారని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Leave a Reply