స్థానికులకే ప్రాధాన్యం ఇచ్చేలా కలెక్టర్లతో చర్చించాలి : మంత్రి కెటిఆర్
నగరంలో నిర్మిస్తున్న డబుల్ ఇళ్లకు లబ్దిదారుల ఎంపిక పక్రియ చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో కలిసి ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గతంలో అందిన వారికి మరోసారి ఇళ్లు రాకుండా చూడాలన్నారు. లబ్దిదారుల ఎంపిక పక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్న చోట పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిపై మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి సక్ష నిర్వహించారు. ఈ సక్షా సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక, గృహ నిర్మాణ శాఖ అధికారులు హాజరయ్యారు.
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి గడువు సపిస్తున్న నేపథ్యంలో లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన ఈ పక్రియ చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హౌసింగ్ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషనర్ నగర పరిధిలో ఉన్న ఇతర జిల్లాల కలెక్టర్లతో కలిసి సంయుక్తంగా లబ్దిదారుల ఎంపిక చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని, త్వరలోనే ఇవన్నీ పూర్తవుతాయని అధికారులు మంత్రులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన మంత్రులు లబ్దిదారుల ఎంపిక పైన ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కోసం ఇతర జిల్లాల పరిధిలో కడుతున్న ఇళ్లలో పది శాతం లేదా 1000 మించకుండా స్థానికులకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు లబ్దిదారుల ఎంపిక పక్రియ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపికపైన కసరత్తు చేయాలని, గతంలో ఇల్లు అందిన వారికి మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకుండా చూడాలని మంత్రులు సూచించారు.