పెద్ద కోడెపాక గ్రామ శివారులో పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, శాయంపేట పోలీసులు సంయుక్తం గా బియ్యం లారీని పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్లు నంది రామ్, మధులు లారీ లోనికి గుట్టు చప్పుడు కాకుండా లోడ్ చేస్తున్న కక్కెర్ల నాగరాజు చిన్న కోడెపాక, రేగుల సాంబయ్య రాజకపల్లి, కోడెపాక, ఇతరులు కలిసి గ్రామాలలో ప్రభు త్వ సరఫరా చేసే పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసుకొని వాటన్నింటిని కలిపి చిన్న చిన్న వాహనాలలో తీసుకొని వచ్చి లారీలోసుమారుగా 400 బ్యాగులు 200 క్విం టాళ్ళ బియ్యం లోడ్ చేస్తుండగా శుక్రవారం పట్టుకున్నారు. అక్రమంగా సరఫరా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకొన్నా రు.
వారిలోకక్కెర్ల నాగరాజుచిన్నకోడెపాక, రేగొండ మండలం, రేగుల సాంబయ్య రాజకపల్లి, చిన్న కోడెపాక రేగొండ మండలం, కొయ్యడ శోభన్ కామారెడ్డిపల్లి పరకాల, మహమ్మద్ ఫయాజ్ ఉత్తరప్రదేశ్, మహమ్మద్ జవీద్ నివాసం ఉత్తరప్రదేశ్, టీటూ మహతో జార్ఖండ్, గునిగంటి ధర్మయ్య కామారెడ్డిపల్లి పరకాల, కొగిలి చిరంజీవి కామారెడ్డిపల్లి పరకాల, జన్ను కుమార్ కామారెడ్డిపల్లి, బేత మహేందర్ గొవిందాపూర్ పరకాల,లు పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసుకొని తిరిగి వీటిని మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో 400 బ్యాగులు (200)ల క్వింటాల్ బియ్యం, ఒక లారీ, ద్వి చక్ర వాహనం, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఎస్హెచ్ఓ శాయంపేటకు అందజేశారు. మొత్తం బియ్యం విలువ. 4,00,000/- ఉటుందన్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్లు నంది రామ్, మధును, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.