Take a fresh look at your lifestyle.

1.60‌లక్షల విలువగల గుట్కాలు స్వాదీనం

కొత్తగూడెం, ఆగస్టు 02 (ప్రజా తంత్ర ప్రతినిధి):   విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 3టౌన్‌ ‌సిఐ వేణు చందర్‌ ‌తన సిబ్బందితో కలిసి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని చిన్న బజార్‌ ‌నందు నిషేధిత గుట్కాలను,పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని సోమవారం నాడు  అదుపులోకి తీసుకున్నారు.చిన్న బజార్‌ ‌నందు గల పవన్‌ ‌కిరాణా దుకాణ యజమాని అయిన ఆసావా పవన్‌ ‌కుమార్‌ ‌వద్ద నుండి 1,60,000 రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కాలను స్వాదీనం చేసుకున్నట్లు సిఐ వేణుచందర్‌ ‌వెల్లడించారు.

ఇట్టి ఉత్పత్తులకు బానిసలుగా మారి యువత తమ ఆరోగ్యాలను చేజేతులా నాశనం చేసుకుంటు న్నారని అన్నారు.ఈ సందర్భంగా సిఐ వేణుచందర్‌ ‌మాట్లాడుతూ కొత్తగూడెం 3టౌన్‌ ‌పోలీసు స్టేషన్‌ ‌పరిధిలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలను విక్రయించడం గానీ,ఇతర అసాంఘిక కార్యకలా పాలకు ఎవరైనా పాల్పడుతూ పట్టుబడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసువారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు.

Leave a Reply