Take a fresh look at your lifestyle.

స్వీయ నియంత్రణే కొరోనా కట్టడి కి శ్రీ రామ రక్ష ..!

*ముందు జాగ్ర త్తే అసలైన మందు
*కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండ..వారి పట్ల వివక్షత వద్దు.. ఆత్మ స్థైర్యం నింపేలా సమాజం వ్యవహరించాలి
*కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పంపిణి కార్యక్రమం లో మంత్రి  హరీశ్ రావు
స్వార్థం విడనాడి సమాజ శ్రేయస్సే పరమావధిగా కొరోనా మహమ్మారి నీ సమష్టిగా ఎదుర్కొనేoదుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలనిరాష్ట్ర మంత్రి  హరీశ్ రావు పిలుపు నిచ్చారు. సిద్ధిపేట పట్టణం ఉపాధ్యాయ శిక్షణా పరిశోధన కేంద్రం భవనం లో శుక్రవారం సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరి ధిలోని నారాయణ రావు పేట , సిద్ధిపేట గ్రామీణ మండలాలకు చెందిన 110 మంది లబ్దిదారులకు 1 కోటి 10 లక్షల 12 వేల రూపాయల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్ రావు పంపిణి చేసారు.
అంతకుముందు మంత్రి  హరీశ్ రావు లబ్దిదారులు ,పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు . కొరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాలసిన ముందస్తు జాగ్రత్తలు గురించీ వివరించారు. కొరోనా బాధితుల పట్ల సమాజం లో రావాల్సిన మార్పులు గురించీ వివరించారు. కొరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్ర త్తె అసలైన మందని మంత్రి  హరీశ్ రావు తెలిపారు .కొరోనా అనగానే అతిగా భయ పడాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో నిర్లక్ష్యం చేయ కూడదన్నారు.ప్రస్తుతం కొరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది కావున అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. ఇంట్లోని తప్పనిసరై బయటికి వస్తే మాస్క్ ధరించాలన్నారు .సానిటై జర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు కొరోనా మహమ్మారి బారిన పడకుండా వుండాలంటే రోజుకు 4 లీటర్ల గోరువెచ్చని నీరు తాగాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. అలాగే వేడి నీటిలో పసుపు, మిరియాలు వేసుకుని ఆవిరి పట్టుకోవాలని సూచించారు. ఇక నిమ్మరసం కూడా… ఎక్కువగా తాగాలన్నారు. కషాయం ను తాగాలన్నారు .ప్రతి రోజూ యోగా ,ప్రాణాయామం చేయాలన్నారు . ఇవన్ని పాటిస్తూ వైద్యుల సలహాలు ,సూచనలు పాటిస్తే 99 శాతం కొరోనా బారిన పడకుండా చూసుకోవచ్చునని అన్నారు . ఒక వేళా కొరోనా బారిన పడ్డా భయపడవద్దన్నారు. వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందా లన్నారు . కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా కోవిడ్ నిర్ధారణ పరీక్షల కేంద్రం ను సందర్శించి పరీక్ష చేసుకోవాలన్నారు . ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అన్న ఆలోచనను విడనాడ లన్నారు . ఆలస్యం చేస్తే ఇతరులకు వ్యాపించడం తో పాటు తమకు ప్రాణ హాని కలుగ వచ్చు న్నారు . కోవిడ్ వస్తే తప్పు చేసినట్లు కాదన్నారు .కొన్ని సార్లు మన ప్రమేయం లేకున్నా వస్తుందన్నారు . ఎవ్వరికైనా వ్యాధి సోకుతుందన్నారు .
కోవిడ్ బాధితుల పట్ల సమాజ స్పందన సరిగ్గా లేదన్నారు. మానవత్వం మంట కలిసేలా కోందరి వ్యవహర శైలి వుందన్నారు. కొరొనా తో మరణిస్తే స్వంత కుటుంబం సభ్యులు కూడా మృత దేహాన్ని తీసుకు వెళ్ళేందుకు రావడం లేదన్నారు. అండగా నిలిచి ఆత్మ స్థైర్యాన్ని నింపాల్సిన సమయంలో కోవిడ్ బాధితులను అంటరాని వారిగా చూస్తున్నారని, సామాజి క బహిష్కరణ చేస్తున్నారని మంత్రి అవేదన వ్యక్తం చేశారు. కొవిద్ బాధితుల విషయంలో సమాజంలొ సానుకూల మార్పులు రావాలన్నారు. అందరూ బాగుండాలి… సర్వేజన సుఖినోభవంతు అనే పాఠం కొరోనా మనకు నేర్పిందన్నారు. సమాజంలో నీ ప్రజలందరూ బాగుంటేే నే మనం బాగుంటమ నీ అవిషయన్ని ఏ ఒక్కరూ విస్మరించ వడ్డన్నారు. సమిష్టిగా కొరొన మహమ్మరి పై సాగే పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల న్నారు.
కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సిద్ధిపేట జిల్లాలో జిల్లా కేంద్రం తో పాటు ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్వీఎం ఆస్పత్రిలో వంద పడకల సామర్థ్యం ఉన్న కోవిడ్-19 బ్లాక్, ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు . కోవిడ్ సోకినా వారు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు హోం క్వారంటైన్ లో ఉండడం లేదా కోవిడ్ హాస్పిటల్ కి వెళ్లాలన్నారు . వచ్చే 2 నెలల్లో కోరనా వ్యాధికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అప్పటి వరకు ప్రజలు అప్రమత్తతే ఆయుధంగా ముందుకు సాగాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేసారు .కొరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ సర్కారు పథకాలను కొనసాగిస్తూ…సంక్షేమానికే పెద్ద పీట వేస్తుo దని ఆన్నారు.దేశంలోని ఎక్కాడా లేనీ వి ధంగా ప్రభుత్వము అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా నిలుస్తున్నాయని మంత్రీ ఆన్నారు.
కొరోనా వచ్చి ప్రభుత్వ ఆదాయం చాలామట్టుకు తగ్గిందన్నారు. వ్యాపార లావాదేవీలు ఆశించిన మేర లేవన్నారు . రాబడి కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఆదాయం కుచించుకు పోయినా యధావిధిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు .రైతు బంధు క్రింద అందించే వానాకాలం పంట సాయం , నెలా నెలా పెన్షన్ లు, పంటల ఉత్పత్తులకు గిట్టు బా టు ధర, కళ్యాణ లక్ష్మి,ఉచిత బియ్యం, ఆర్ధిక సహాయం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కష్ట కాలంలో పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలే …..పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి కి నిదర్శనమని అన్నారు. కష్ట కాలంలో పేదల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ముఖ్యమంత్రి సం క్షేమ పధకాల ను అమలు. చేస్తున్నార నీ మంత్రి అన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,,సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి,rdo అనంత రెడ్డి , amc ఛైర్మన్ పాల సాయిరాo, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Attachments area

Leave a Reply