పోడు రైతులపై ఫారెస్టు అధికారుల దాడులను నివారించాలని వారు చేసుకున్న పోడు భూములకు పట్టాలను అందించాలని ములుగు ఎమ్మేల్యే సీతక్క డిమాండ్ చేశారు. శనివారం హైదారాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పోడు రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలోని పోడు చేసుకున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్ట అధికారులు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని,వారి దాడులను నివారించాలని, ముఖ్యమంత్రి గత అసెబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం వారు చేసుకుంటున్న భూములకు పట్టాలందించాలని సీతక్క ఇచ్చిన లేఖలో పెర్కోన్నారు. అంతే కాకుండా ఏటూరునాగారంలోని ఐటిడిఏలో ట్రైబల్ అడ్వైజరీ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకు ఒక సారి ఏర్పాటు చేసి ఐటిడిఏ పేరుకపోయిన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు.అనంతరం భవన నిర్మాణాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి ములుగు నియోజకవర్గంలోని అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్న రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని విన్నవించారు. ఈ ప్రాంతాల నుండి ఇసుక రవాణా జరుగుతుందని దీంతో రోడ్డు మార్గం పూర్తిగా ద్వంసం అవుతుందన్నారు. మరమ్మత్తులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతే కాకుండా పాకాల చెరువు నుండి కోత్తగూడ వరకు 10 కిలోమీటర్లు,కోత్తగూడ నుండి గంగారం 10 కిలోమీటర్లు,మల్లంపల్లి క్రాస్ నుండి కోడిషలకుంట 15 కిలోమీటర్లు, మంగపేట మండల క్రాస్ నుండి కోమటిపల్లి 10 కిలోమీటర్లు,రాజుపేట బిటి రోడ్లు,ఆర్అండ్బి రోడ్లు,కోత్త చీపురు దుబ్బ 3 కిలోమీటర్లు మేరకు మంజూరి చేయ్యాలని ఆమే ఆ లేఖలో కోరారు.
మరో వారం రోజులు పొడి•గించాలి
ములుగు జిల్లాలో రైతులు పండించిన పంటలను ఆమ్ముకోవడానికి ఇంకా వారం రోజుల పాటు గడువు పోడగించాలని ములుగు ఎమ్మేల్యే సీతక్క హైదరాబాద్‌లోని సివిల్ సప్లయి కమీషనర్‌ను లేఖ ద్వారా కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయి కమీషనర్‌ను మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలను ములుగు ప్రాంతంలో లారీల కోరుత ఉందని అధికారులు రైతుల పంటలను కల్లాల వద్దనే ఉంచారన్నారు. ప్రభుత్వం పెట్టిన గడువుకు అదనంగా రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు మరో వారం రోజులు పోడిగించి రైతులను అదుకోవాలని ఆ లేఖలో కోరారు.