Take a fresh look at your lifestyle.

సికింద్రాబాద్‌ కుట్రకేసు

“ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు సమర్థనగా సాక్ష్యాధారాలు సకూర్చుకోవచ్చునని, తన మీద విధించిన లేదా విధించనున్న శిక్ష ఏ విధంగా తప్పుడుదో వాదించుకోవచ్చునని రాజ్యాంగం చెబుతుందని న్యాయవూర్తులు ముందుగా వివరించారు.”

ఇక జి రాజలోచన్‌ విషయంలో ఆయన 1955 నుంచీ ప్రభుత్వ కొలువులో ఉన్నాడు. ఉద్యోగం నుంచి తొలగించే సమయానికి హనుమకొండలోని వడ్డేపల్లిలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లీషు, తెలుగు బోధించే ఉపాధ్యాయు డుగా ఉన్నాడు. ఆయన లోచన్‌ పేరుతో కవిత్వం రాసేవాడు, విప్లవ రచం­తల సంఘం సభ్యుడు. ఆయన రచనలు దేశంలో ఉనికిలో ఉన్న విద్యావిధానాన్ని విమర్శిస్తూ నక్సలైటు భావాలను ప్రచారం చేస్తున్నాయని అందువల్ల అవి ప్రభుత్వోద్యోగుల సర్వీసు నిబంధనలకు వ్యతిరేకమని, కనుక సంజాయి­షీ కోరుతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఆయనకు 1975 ఆగస్టు 4న ఒక లేఖ పంపించాడు. లోచన్‌ తన వివరణ రాసిన తర్వాత, జిల్లా విద్యాశాఖాధికారి 1976 ఫిబ్రవరి 3న ఉద్యోగ హోదాను ఎందుకు తగ్గించకూడదో సంజాయిషీ కోరుతూ రెండో లేఖ రాశాడు. లోచన్‌ రాసిన వివరణలనే తప్పిదాల ఒప్పుకోలుగా పరిగణిస్తూ 1976`77 ఆర్థిక సంవత్సరంలో ఇంక్రిమెంట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు కొనసాగుతున్న ఎమర్జెన్సీ వల్ల లోచన్‌ ఈ ఉత్తర్వును సవాలు చేయలేకపోయాడు.

ఇది ఇలా ఉండగా, ఎమర్జెన్సీలో అన్ని చోట్లా జరిగినట్టుగానే వరంగల్‌లో 1976 జూన్‌ 20న యాభై మంది రచం­తలను, కవులను, మేధావులను, ఉపాధ్యాj­లను విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకుని రెండు, వూడు వారాలపాటు ఒక నిర్బంధ శిబిరంలో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. అలా నిర్బంధంలో చిత్రహింసలకు గురైన వారిలో లోచన్‌ కూడా ఒకరు. పదహారురోజులపాటు ఆ చిత్రహింసల తర్వాత, 1976 జులై 10న ఆయనను ఆంతరంగిక భద్రతా చట్టం కింద జైలుకు పంపారు. ఎమర్జెన్సీ ఎత్తివేసే వరకూ ఆయన జైలు నిర్బంధంలోనే గడిపారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత విడుదల అయి­న వెంటనే 1977 మార్చి 23న మళ్లీ ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆయన సికింద్రాబాద్‌ కుట్రకేసులో నిందితుడని తప్పుడు ఆరోపణ మోపారు. సృజన పత్రికకు రచనలు చేసేవాడని, హనుమకొండలో లెనిన్‌ జయంతి, మేడే సభలు జరిపాడని ఆరోపించారు. ఈసారి నిర్బంధం నుంచి కొద్ది రోజులలోనే విడుదల చేశారు. కాని 1980 మార్చి 21న ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. లోచన్‌ విషయంలో ఈ వాస్తవాలు చెబుతూ ఆయన మీద ప్రభుత్వం ఎట్లా కక్ష సాధింపు ధోరణితో ఉన్నదో నేను కోర్టుకు వివరించాను. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడం అప్రజాస్వామికమనీ, చట్టవ్యతిరేకమనీ వాదించాను.

లోచన్‌కు సంబంధించి నా వాదనలను ఖండిస్తూ ప్రభుత్వ న్యాయవాది చేసిన ప్రతి వాదనలు చిత్రంగా ఉన్నాయి . లోచన్‌ ప్రజలను సాయుధ విప్లవానికి రెచ్చగొడుతూ చాలా విస్ఫోటకమైన కవితలు రాశాడని, అదే విధమైన ఉపన్యాసాలు ఇచ్చాడని ఆ ప్లీడరు అన్నారు. భుత్వోద్యోగుల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఆయన ప్రజలను, విద్యార్థులను హింసకు పురికొల్పుతున్నాడని అన్నాడు. ప్రభుత్వ న్యాయవాది చెప్పిన ప్రకారమే ఈ ఇద్దరు చేసిన నేరాలు కవిత్వం రాయడం, ఉపన్యాసాలు చేయడం. మరొక కోర్టులో విచారణలో ఉన్న కేసులో ముద్దాయిలు కావడం మాత్రమే అం­తే అవి రాజ్యాంగ అధికరణం 311(2)(సి) కింద ఉద్యోగం నుంచి తొలగించడానికి సరిపోయి­నవి కావని నేను వాదించాను. అవే నేరాలు అయితే అవి విచారణ అవసరం లేని నిబంధనలకు అవకాశం ఇవ్వవని, అవే నేరాలపై మరొక సెషన్స్‌ కోర్టు బహిరంగ విచారణ జరుపుతున్నప్పుడు, ఈ సందర్భంలో మాత్రం విచారణ జరపడం భద్రతా కారణాల రీత్యా కుదరని పని ఎలా అవుతుందని నేను ప్రశ్నించాను. అలాగే, ఏ ఉద్యోగి మీదనైనా శాఖాపరమైన విచారణ దేశభద్రత దృష్టా ప్రమాదకరమైనదని అనడానికి వీలు లేదని నేను వాదించాను.

ఈ వాదనలన్నీ విన్న న్యాయవూర్తులు తమ 17 పేజీల తీర్పులో ప్రభుత్వ వాదనలను తిరస్కరించారు. మొ­ట్టమొ­దట, రాజలోచన్‌ సికింద్రాబాద్‌ కుట్రకేసులో నిందితుడా కాదా అన్నది అప్పటికప్పుడు పరీక్షించగలిగిన వాస్తవం. ఆ కేసు అప్పటికి ఆరు సంవత్సరాలుగా నడుస్తున్నది. చార్జి షీటు దాఖలైంది. ఆ కేసులోని 600 మంది సాక్షులలో అప్పటికే 40 మంది సాక్షులను విచారించడం కూడా అయిపోయింది . అంత సులభంగా చార్జిషీటు చూసి దానిలో రాజలోచన్‌ పేరులేదని గుర్తించగలిగిన విషయంలో కూడా పోలీసు ప్లీడరు ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు అర్థం కాదు. పోలీసులు, పోలీసు ప్లీడర్లు ఇదే మాదిరిగా చాలా సులభంగా ధృవీకరించుకోగలిగిన విషయాలలో కూడా అబద్ధాలు ఆడుతుంటారు. తమను ఎవరూ తప్పుపట్టరని తప్పుపట్టగూడదని వాళ్ల ఉద్దేశ్యం. జస్టిస్‌ మాధవరెడ్డి, జస్టిస్‌ వ­క్తధర్‌లు మొ ట్టమొ­దట అది అబద్ధమని, రాజలోచన్‌ ఆ కేసులో నిందితుడు కాడని స్పష్టం చేశారు. ఆ తీర్పు మొ­దట రాజలోచన్‌ గురించి ప్రభుత్వం చేసిన తప్పుడు ఆరోపణను తిరస్కరించిన తర్వాత, వారిని రాజ్యాంగ అధికరణం 311(2)(సి) కింద విచారణ లేకుండా తొలగించవచ్చునా లేదా అనే విషయం చర్చకు తీసుకుంది.

ఏ ప్రభుత్వోద్యోగి అయి­నా ఏదైనా అనుచితమైన పనికి పాల్పడ్డారని, క్రమశిక్షణను ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై విచారణ జరపవలసి ఉంటుందని రాజ్యాంగంలోని 311 అధికరణం చెబుతుంది. ఆ విచారణలో తన మీద వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పుకునే అవకాశం ఆ ఉద్యోగికి కల్పించబడుతుందని, ఆ ఉద్యోగి తన మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా, తనకు సమర్థనగా సాక్ష్యాధారాలు సకూర్చుకోవచ్చునని, తన మీద విధించిన లేదా విధించనున్న శిక్ష ఏ విధంగా తప్పుడుదో వాదించుకోవచ్చునని రాజ్యాంగం చెబుతుందని న్యాయమూర్తులు ముందుగా వివరించారు. రాజ్యాంగంలోని అధికరణం 311 ప్రభుత్వోద్యోగులకు ఇటువంటి రక్షణ కల్పించడానికే ఏర్పాటైందని వివరించారు. ఆ విచారణ రక్షణకు అధికరణం 311(2) లో ఉప నిబంధన (సి) కింద ఒక మినహాయింపు కూడా అధికరణం 311లోని ఒక్క నిబంధన అయినా అన్వయించినప్పుడు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. రాజ్య భద్రతా ప్రయోజనాల దృష్ట్యా విచారణ జరపడం క్షేమకరం కాదని రాష్ట్రపతిగాని గవర్నర్‌గాని సంతృప్తి చెందినపుడు విచారణ అవసరంలేదని ఆ మినహాయింపు చెబుతుంది.

ఇక్కడ గవర్నర్‌ సంతృప్తి పడడం అంటే ఏమిటో నిర్ధారించడానికి న్యాయమూర్తులు ప్రయత్నించారు. గవర్నర్‌ సంతృప్తి పడడం అంటే, తొలగించబడుతున్న ఉద్యోగి మీద వచ్చిన ఆరోపణలు తొలగించడానికి తగినవే అని సంతృప్తిపడడం అని అర్థం చేసుకోగూడదని, కేవలం విచారణ అవసరంలేదనే విషయానికి సంతృప్తి పడడం మాత్రమేనని న్యాయమూర్తులు అన్నారు. ‘‘ప్రభుత్వోద్యోగి మీద వచ్చిన అభియోగాల స్వభావం ఏమయినప్పటికీ, గవర్నర్‌ సంతృప్తి అనేది రాజ్యాంగ అధికరణం 311(2)(సి) ప్రకారం విచారణ జరపడం సముచితం కాదన్నంత వరకే’’ అని వాళ్లు స్పష్టం చేశారు.
-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply