Take a fresh look at your lifestyle.

సికింద్రాబాద్‌ ‌బోయిగూడాలో ఘోర అగ్నిప్రమాదం

 • 11మంది బీహార్‌ ‌కార్మికులు సజీవ దహనం
 • కార్మికులు నిద్రలో ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారుల వెల్లడి
 • ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణమని ప్రాథమికంగా నిర్ధారణ
 • రంగంలోకి దిగి మంటలను ఆర్పిన ఫైరింజన్లు
 • సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
 • ఘటనపై ప్రధాని మోదీ, గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌తదితరుల తీవ్ర దిగ్బ్రాంతి
 • మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సిఎం కెసిఆర్‌
 • ‌మృతదేహాలను బీహార్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని సిఎస్‌కు ఆదేశం
 • ఘటనా స్థలిని పరిశీలించిన మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని, సిఎస్‌, ‌సిపి
 • ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పిసి అధ్యక్షుడు రేవంత్‌, ‌విహెచ్‌
 • అగ్నిప్రమాదంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విచారం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. బోయిగూడలోని ఓ స్క్రాప్‌ ‌గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా ప్రమాదంలో 11 మంది బాహార్‌ ‌రాష్ట్రనికి చెందిన కార్మికులు సజీవదహనం అయ్యారు. బుధవారం తెల్లవారుజామన స్క్రాప్‌ ‌గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. అందులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.. ఇద్దరు కార్మికులను ఫైర్‌ ‌సిబ్బంది కాపాడారు. ఇక, స్క్రాప్‌ ‌గోదాం పక్కనే టింబర్‌ ‌డిపోలు ఉడడంతో స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన ఎనిమిది ఫైర్‌ ఇం‌జన్లు మంటలను అదుపుచేశాయి. కానీ, అప్పటికే 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. మృతులంతా బీహార్‌కు చెందిన కార్మికులుగా సమాచారం అందుతుంది. ప్లాస్టిక్‌ ‌గోదాం అయినా ఇక్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేవని ఆరోపణలు ఉన్నాయి. షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణంగా స్క్రాప్‌ ‌గోదాంలో మంటలు చెలరేగి.. గోదాం మొత్తం వ్యాపించాయి. స్క్రాప్‌ ‌దుకాణంలో చెత్త కాగితాలు, ప్లాస్టిక్‌ ‌స్క్రాప్‌, ‌మందు బాటిళ్లు సామాన్లు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కార్మికులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా చెబుతున్నారు. గాంధీ నగర్‌ ‌పోలీసులు మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌ ‌మార్చురీకి తరలించారు. మంటల ధాటికి మృతదేహాలు గుర్తు పట్టనంతగా ముద్దగా మారాయి.

ఇక వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్రమంగా అవి మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అదుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలను అదుపుచేశారు. మంటల ధాటికి గోడౌన్‌ ‌పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు సజీవదహనమవగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని వారు తెలిపారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాద సమయంలో టింబర్‌ ‌డిపోలో 12 మంది ఉన్నారని చెప్పారు. మృతులంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులని తెలిపారు. మృతులను సికిందర్‌ (40), ‌బిట్టు (23), సత్యేందర్‌ (35), ‌గోలు (28), దామోదర్‌ (27), ‌రాజేశ్‌ (25), ‌దినేశ్‌ (35), ‌రాజేశ్‌ (25), ‌చింటు (27), దీపక్‌ (26), ‌పంకజ్‌ (26)‌గా గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్‌ ‌డిపో, స్క్రాప్‌ ‌గోదాం ఉన్నాయని పోలీసులు చెప్పారు. టింబర్‌ ‌డిపో నుంచి స్క్రాప్‌ ‌గోదాముకు మంటలు వ్యాపించాయన్నారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి ఇబ్బందయిందని తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అగ్ని మ్రాద ఘటనపై గవర్నర్‌, ‌సిఎం తీవ్ర దిగ్బ్రాంతి… మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సిఎం కెసిఆర్‌
‌సికింద్రాబాద్‌ ‌బోయిన్‌పల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్‌ ‌తమిళిసై తీవ్ర సంతాపం తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు గవర్నర్‌ ‌ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే వారి కుటుంబాలను ఆదుకోవాలని గవర్నర్‌ ‌తమిళిసై కోరారు. అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సీఎం పరిహారం ప్రకటించారు. మృతదేహాలను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అనధికార గోదాముల నిర్వహణపై చర్యలు: బోయిగూడ అగ్నిప్రమాద స్థలిని సందర్శించిన హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ


రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాంలు ఉన్నాయని చెప్పారు. సికింద్రాబాద్‌లోని బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని హోం మంత్రి పరిశీలించారు. ప్రమాద కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ..ప్రమాదంలో 11 మంది మరణించారని చెప్పారు. మృత దేహాలను గాంధీ దవాఖానకు తరలించామని, అక్కడ వాటి గుర్తింపు జరుగుతున్నదని తెలిపారు. ఇప్పటికే ఆరు మృతదేహాల గుర్తింపు పూర్తయిందని, ఐదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. వారి మృతదేహాలను ఎయిర్‌ అం‌బులెన్స్‌లో స్వస్థలాలకు పంపిస్తామన్నారు. ప్రమాదంపై జీహెచ్‌ఎం‌సీ, పోలీసు శాఖ, అగ్నిమాపకశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గోదాముల ఘటనపై అధికారులతో సవి•క్షిస్తామన్నారు. నగరంలోని గోదాముల రక్షణ చర్యలపై చర్చిస్తామని చెప్పారు.

మృతదేహాలను బీహార్‌కు తరలిస్తాం: సిఎస్‌ ‌సోమేష్‌కుమార్‌


‌సికింద్రాబాద్‌లోని బోయిగూడలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ఇతర పోలీస్‌ అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి వెల్లడించారు. అగ్నిమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఈ మేరకు సీఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌వి•డియాకు తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన వాళ్లంతా బీహార్‌కు చెందిన వాళ్లని, వారి వారి ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతున్నామని సీఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు.

కార్మికులు నిద్రలో ఉండగా ప్రమాదం: ప్రమాద స్థలిని పరిశీలించిన సిపి ఆనంద్‌

‌సికింద్రాబాద్‌ ‌బోయిగూడలోని టింబర్‌ ‌డిపోలో జరిగిన అగ్నిప్రమాద స్థలిని సీపీ సీవీ ఆనంద్‌ ‌పరిశీలించారు. గోదాం విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏవి•లేవని చెప్పారు. కార్మికులంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నదని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ..గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పేలినట్లు 100కు ఫోన్‌కాల్‌ ‌వొచ్చిందని చెప్పారు. సిలిండర్‌ ‌పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. కింద ప్లోర్‌లో తుక్కుసామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వొస్తుందని తెలిపారు. మృతులు బీహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గోదాం యజమానికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌, ‌విహెచ్‌
అగ్నిప్రమాదం ఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోయిగూడ తుక్కు పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు రేవంత్‌ ‌ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవ దహనమవడం అత్యంత విషాదకరమని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కూలీ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ ‌గ్రేషియా ఇవ్వాలన్నారు. స్థానిక శాసన సభ్యుడు కూడా రూ.5 లక్షలు ఇచ్చి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వీహెచ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

అగ్నిప్రమాదంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విచారం
సికింద్రాబాద్‌ ‌బోయిగూడలోని ప్లాస్టిక్‌ ‌గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 11 మంది పేద కార్మికులు సజీవదహనం కావడం కలచివేసిందన్నారు. మృతులంతా బీహార్‌ ‌వాసులని తెలిసిందని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. పొట్టకూటి కోసం వొచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనుమతుల నుంచి ఫైర్‌ ‌సేప్టీ చర్యల వరకు అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ ‌సూచించారు.

Leave a Reply