“అభివృద్ధి చెందిన దేశాల్లోని విస్త•తంగా ‘ఐసిటి’ Information and Communication Technologyని వినియోగించే విద్యార్థులకు, సంపన్నులకు పనికి వచ్చే ఆన్లైన్ తరగతులు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందుబాటులోకి తేవాలనుకోవం ఆయా వర్గాల పిల్లలకు అసలు చదువుకు దూరం చేయడమే కాకుండా.. కొరోనా అనంతరం కార్పోరేట్ ప్రైవేట్ శక్తులకు దోహదపడుతుంది. ఇప్పటికే విశాలమైన తరగతి గదుల్లో ఫిజికల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లతో మధ్యతరగతి వర్గాల పేద పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్చుకోవడానికి సన్నద్దమౌతున్న సందర్భంలో వున్నాం!”
ప్రపంచీకరణ అనంతర అభివృద్ధి నమూనాలో ప్రకృతి విధ్వంసంతో పాటు, పర్యావరణ సంక్షోభం మనిషిపై చూపే ప్రతీకారానికి నిదర్శనంగా కోవిడ్-19 వైరస్ ఇవ్వాళ ప్రపంచాన్ని ‘ఐసోలేషన్’లోకి నెట్టి వేయడానికి..! మనిషి మనుగడకు దోహదపడాల్సిన విద్యారంగం, శాస్త్ర పరిశోధన రంగాల్లో కొనసాగించిన నిర్లక్ష్యం ఈనాటి సంక్షోభానికి నిదర్శనంగా నిలిచింది.
కోవిడ్ ‘విపత్తు’కు మానవ సమాజం గతంలో ఎన్నడూ ఎదుర్కోని శారీరక, మానసిక, ప్రకృతి విధ్వంసంతో విలవిల్లాడటం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడ కన్నా, మార్కెట్ శక్తుల విస్తరణ కోసం పర్యావరణాన్ని, ప్రకృతిని నాశనం చేసి జీవావరణానికి హాని కలిగిస్తున్న పెట్టుబడిదారీ విధానపు విశృంఖలతకు కొరోనా సంక్షోభం ప్రత్యేక నిదర్శనం..
అది వూహాన్లో పుట్టినా, లేక సృష్టించబడినా కోవిడ్-19 సృష్టిస్తున్న విలయం ఇవ్వాళ అన్ని రంగాలతో పాటు విద్యారంగాన్ని పాఠశాల, కళాశాల వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించిందన్నది నిర్వివాదాంశం.
విద్య, వైద్యం ప్రభుత్వ అజమాయిషీలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కొనసాగకపోతే జరుగుతున్న విపత్తును కోవిడ్ వైరస్ విస్తరిస్తున్నతీరులో గమనించవచ్చు. ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో పాటు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు కోవిడ్ నివారణకు చేపట్టిన చర్యల్లో మనం విద్య, వైద్య రంగాల ఆవశ్యకతను చూడొచ్చు. ఇవ్వాళ వైద్యరంగం ప్రజాసంక్షేమం కోసం వినియోగించిన క్యూబాలాంటి దేశాలు, కేరళ మోడల్ సత్ఫలిస్తున్న సందర్భాల్లో విద్యారంగంతోపాటు వైద్యం అనివార్యంగా ప్రభుత్వమే ప్రజాసంక్షేమం దృష్ట్యా కొనసాగిస్తే తప్ప కోవిడ్‌లాంటి వైరస్ల మీద సమరం, ‘సహజీవనం’ ప్రధాని చెపుతున్నట్లు అంత తేలికగా గెలిచి తీరాల్సిన యుద్ధం కాకుండా, యుద్ధభూమిలో ఒరిగిపోయే సైనికుల్లా మిగలాల్సి వస్తుందని కొరోనా అనంతరం పరిణామాలు తెలుపుతున్నవి.తెలంగాణలో చేయవలసినన్ని టెస్ట్‌లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రేస్, టెస్ట్, ట్రీట్ అన్న మూడు ‘టీ’ల మూడుటిల పట్ల కొంత విమర్షను ఎదుర్కొంటున్నా.. కోవిడ్ విజృంభణలో కొరోనా పాజిటివ్‌లకు చికిత్స అందించడంలో గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ పర్యవేక్షణలో తప్ప ప్రైవేట్ వైద్యశాలలను అనుమతించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన విధానం అభినందనీయం..సరిగ్గా అదే విధానం తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ‘కొరోనా’ సృష్టించిన వలయంలో బడి తరగతి గది పాఠశాల అనివార్యంగా మారవలసి వున్నది. ప్రభుత్వమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘యునిసెఫ్’ లాంటి సంస్థల సూచనల మేరకు ఇప్పుడు మన బడులను, తరగతి గదులను యుద్ధ ప్రాతిపదికగా మార్చవలసి వున్నది.
ఆన్లైన్ క్లాస్‌లు, డిజిటల్ తరగతులు, మనటీవి యూట్యూబ్ ఛానెల్లో, దీక్షDIKSHA) Digital infrastructure for knowledge sharing app లాంటి ఆన్లైన్ తరగతులు, వెబ్నార్లు, జూమ్ మీటింగ్‌లు తరగతి గదిలో విద్యార్థి అభ్యసనను పెంపొందించడానికి సహాయపడతాయి తప్ప ప్రత్యక్షంగా తరగతి టీచర్ బోధనా అభ్యసన తీరుకు ప్రత్యామ్నాయం కాజాలదు అని అనేక సర్వేలు విశ్లేషిస్తున్నవి.కనుక పెట్టుబడిదారి అభివృద్ధి చెందిన దేశాల్లోని విస్తృతంగా ‘ఐసిటి’ Information and Communication Technology ని వినియోగించే విద్యార్థులకు, సంపన్నులకు పనికి వచ్చే ఆన్లైన్ తరగతులు, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందుబాటులోకి తేవాలనుకోవం ఆయా వర్గాల పిల్లలకు అసలు చదువుకు దూరం చేయడమే కాకుండా.. కొరోనా అనంతరం కార్పోరేట్ ప్రైవేట్ శక్తులకు దోహదపడుతుంది. ఇప్పటికే విశాలమైన తరగతి గదుల్లో ఫిజికల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లతో మధ్యతరగతి వర్గాల పేద పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్చుకోవడానికి సన్నద్దమౌతున్న సందర్భంలో వున్నాం!
అనివార్యంగా కొరానా సృష్టించిన కల్లోలంలో కష్టజీవుల పిల్లలు, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చదువుకొనడానికి ఏమాత్రం ఖర్చు పెట్టే స్థితి లేని సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారు.. ఇప్పుడే ప్రభుత్వం యుద్దప్రాతిపదికన ప్రభుత్వ విద్యారంగం, ప్రజలందరికీ ఇప్పుడు ‘వైద్యం’ అందిస్తున్నట్లు ప్రభుత్వ పాఠశాలలే విద్యను అందించడానికి అందరికీ సమాన నాణ్యమైన చదువుల కోసం పాఠశాలల్ని సిద్ధం చేయవలసియున్నది. విద్యాశాఖ ఇవ్వాళ మన పాఠశాల వ్యవస్థలోని భౌతిక, సామాజిక, ఆర్థిక, పారిశుద్య అంశాల పట్ల దృష్టి సారించి పాఠశాల తెరిచేనాటికి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ విద్యారంగం ‘కోవిడ్’ కోరల్లో ప్రైవేటీకరణకు పాజిటివ్‌గా మారి ఎడ్యుకేషన్ వైరస్ ‘సామాజిక’ దూరాన్ని పెంచి మానవ సమాజాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతుంది.కోవిడ్-19 సృష్టించిన సామాజిక సంక్షోభంలో మనిషి మనుగడలోనే ఒక కొత్త రకం వైరస్‌తో సహజీవనం చేస్తూనే జీవించాల్సిరావడం అత్యంత బాధాకరమైన సందర్భం. గడపదాటితే కొరోనా కాటు వేస్తుందన్న స్థితి నుండి కొరోనాతో సహజీవనం చేయాల్సిన దుస్థితిలో అనివార్యంగా పాఠశాల తప్పనిసరిగా తన రూపురేఖల్ని మార్చుకోవాలి. యూనిసెఫ్ (UNICEF) United Nations Internationa Children’s Emergency Fund (IFRC) International Federation of Red Cross, (WHO) World Health Organisations సూచించన నియమావళి మేరకు వెంటనే పాఠశాలలు రూపాంతరం చెందాల్సి వుంది.
లి మొట్టమొదట పాఠశాలకు హాజరయ్యే టీచర్లు విద్యార్థుల ఆరోగ్య స్థితిని గుర్తించే ఆరోగ్య కార్యకర్తలు పాఠశాల ఆవరణలో పరీక్షించే ఇద్దరు హెల్త్ వర్కర్స్ నియామకంతోపాటు, పాఠశాల ఆవరణలోనికి వచ్చే ప్రతి విద్యార్థి చేతులు శుభ్రం చేసుకోడానికి ‘సబ్బు-నీటి’ వసతి ఏర్పాటు నిర్మాణాలు చేపట్టాలి. లి అన్నిటికన్నా ముఖ్యంగా పాఠశా)లు తెరవడానికి పారిశుద్యంతో పాటు తరగతి గదులు, ఆల్మారాలు, బెంచీలు, కుర్చీలు శుభ్రం చేసి శానిటైజ్ చేసే స్వీపర్, స్కావె•ంజర్లను పెద్ద మొత్తంలో నియామకం చేయాలి, ఇప్పుడు చెల్లిస్తున్న కేవలం మూడువేల ఐదువందల రూపాయల వేతనంతో (ఇప్పుడు ఇంకా కోత) పరిశభ్రమైన పాఠశాల సాధ్యం కాదు.. కనీసంగా ఇద్దరు రెగ్యులర్ వేతనంలో నియమించబడిన శానిటైజర్ వర్కర్లు లేదా కనీస వేతనంతో ఇంకా కావాల్సిన అదనపు పారిశుధ్య కార్మికులను నియమించడం లి పాఠశాలకు వస్తున్న విద్యార్థులు సామూహికంగా ‘ప్రార్థన’ చేయగల ఆవరణ ఉన్నా భౌతిక దూరం పాటించడం అనివార్యం కనుక ప్రార్థనా సమావేశాలను నిలిపి వేయాలి.లి తరగతి గదుల్లో సంఖ్య తగ్గిపోయిన పాఠశాలలకు సంఖ్యకు తగ్గట్లు (15-20) మధ్య విద్యార్థులను కనీసం మూడ అడుగుల దూరంతో బెంచీలు ఒక్కొక్కరికి ఒక్కటి. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కనుక ఇప్పుడున్న పొడవైన బెంచీకి ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున సర్ధుబాటు చేయడం. తరగతి గదిలో శానిటైజర్ ఏర్పాటు చేయాలి. రోజుకు రెండుసార్లు శుభ్రపరచడం కనీసం ఒక్కసారైనా తరగతి మొత్తాన్ని డిజ్ ఇన్ఫెక్టెంట్ ద్రావణంతో స్ప్రే చేయడానికి సంబంధించిన వనరులు ఏర్పాటు చేయాలి.
లి పాఠశాలకు వస్తున్న విద్యార్థుల ఆరోగ్య వివరాలు, టీచర్ల స్థితిగతులు నిరంతరం గమనించడం అనారోగ్యంతో వున్న విద్యార్థులను టీచర్లను పాఠశాలకు రాకుండా నిరోధించాలి. వీలైతే సంఖ్యను బట్టి పాఠశాలల్ని తరగతుల్ని విభజన చేసి హాజరు మినహాయింపు ఇవ్వాల్సి వుంటుంది.లి అన్నిటికన్నా ముఖ్యంగా కొరానా విస్తరణ నేపథ్యంలో ప్రతీ పాఠశాల సురక్షిత కేంద్రంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలే ప్రజలకు, పేద పిల్లల సంక్షేమానికి భరోసాగా ఉంటుందన్న విశ్వాసాన్ని, గాంధీ వైద్యశాలలో ప్రభుత్వ చర్యలతో వైద్యరంగంతో ‘ప్రైవేటీకరణ’కు అవకాశం లేకుండా చేసినట్లు ప్రభుత్వమే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని హంగులు, వసతులు, వనరులను సమకూర్చడం తప్పక చేయవలసిన పని. ప్రతి పాఠశాలలో కనీసం ఒక హెల్త్‌వర్కర్‌తో పాటు పాఠశాల పరిసరాల్ని, తరగతి గదుల్ని, ఫర్నీచర్ర్ని శానిటైజ్ చేయడానికి ప్రత్యేకంగా పారిశుద్ధ్య డిస్ఇన్ఫెక్టెంట్ ఎక్విప్మెంట్స్తో పరిశుభ్రతను కొనసాగించాలి.
పాఠశాల లోపలికి వస్తున్న విద్యార్థులకు ఆవరణలోనే సబ్బు, ట్యాప్ చాలినంత నీరు ఉండేలా చూడాలి. మాస్క్‌లు, తరగతి గదుల్లో కనీసం మూడు అడుగుల దూరంలో బెంచీలు. ఇప్పుడున్న బెంచీల్ని వీలైతే రెండుగా విడగొట్టి ప్రతి విద్యార్థికి ఒక బెంచీ వచ్చేలా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టాయ్‌లెట్స్, శానిటేషన్ రన్నింగ్ వాటర్ లేక చాలా చోట్ల అత్యంత అపరిశుభ్రంగా మూతబడి ఉన్నటువంటి వాటిని వెంటనే ఉపయోగంలోకి తేవడంతో పాటు పెద్ద సంఖ్యలో మరిన్ని నూతన విధానంలోని టాయ్‌లెట్స్ నిర్మాణం చేయవలసివున్నది.
నిరంతరం సమాచారాన్ని జాగ్రత్తల్ని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు పేరెంట్స్ కమిటి సమన్వయంతో పాఠశాల ఆవరణ ముఖ్యంగా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు. ప్రత్యామ్నాయ భోజనానికి బదులు అసలు విద్యార్థులకు మరింత మొత్తాలను స్కాలర్షిప్ రూపంలో అందిస్తే ఎలా వుంటుందనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే సామూహికంగా విద్యార్థులకు వండి వార్చడం కష్టమైనది మరియు అనారోగ్యకరమైనది కూడా..
లి అట్లాగే విద్యార్థులు జలుబు, జబ్బున పడిన టీచర్ల విషయంలో కూడా హాజరు పట్ల కఠినంగా ఉండవలసిన అవసరం లేదని యునిసెఫ్ తన గైడ్‌లైన్‌లో సూచించింది. ‘‘»Discourage perfect Attendanceµµ ’ అనింది. రోజు విడిచి రోజు అని, షిప్ట్ విధానం లేదా విద్యార్థుల సంఖ్యను విభజించడం, సెక్షన్లను పెంచడం ద్వారా తరగతి గది, పాఠశాల భౌతిక దూరం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే కోవలో స్కూల్ హాజరు శాతాన్ని పరిశీలించడం విరామాలు, పరీక్షలు సెలవులు ఇవ్వడానికి ప్రత్యేక అకడమిక్ క్యాలెండర్లు రూపొందించాలి.
లి అట్లాగే విద్యార్థి ఉపాధ్యాయులు అనుపస్థితి వల్ల గాని పాఠశాల నిర్వాహణలోపం వల్లగాని ‘నిరంతరం విద్యార్థికి నాణ్యమైన విద్య’ను అందించడానికి ఆన్లైన్, ఆఫ్‌లైన్, స్మార్ట్‌ఫోన్, మనటీవి, రేడియో, వాట్సప్ సమూహాల్లో విద్యార్థులకు హోమ్‌వర్క్ విద్యా విషయక అంశాలను అందించగలగాలి. అందుకోసం తరగతికో టివి, కంప్యూటర్స్, డిజిటల్ తరగతుల కోసం ప్రత్యేకమైన ‘ఐసిటి’ సామాగ్రిని విస్త•తంగా వినియోగంలోకి తేవాలి. పాఠశాలలన్నీటికి ఉచిత విద్యుత్, నెట్ సౌకర్యాన్ని అందించాలి. కేయాన్లు, తరగతికో స్క్రీన్, సౌండ్ బాక్స్‌లతో ప్రత్యేకంగా తరగతి గదుల్ని రెండు ద్వారాలు, నాలుగు కిటికీలు సరియైన ఫ్లోరింగ్, బ్లాక్ బోర్డులతో సంసిద్ధం చేయకుండా కొరోనా అనంతర పాఠశాలలు మనుగడ సాగించలేవు. అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విద్య కోసం నిధులు కేటాయించాల్సి వుంది. లి దీనితోపాటు మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఇంతకుముందుకన్నా అత్యవసరమైన కొరోనాతో పాటు శాస్త్ర సంబంధమైన ఆరోగ్యకర అంశాలపట్ల సిలబస్‌లో ప్రత్యేక స్థానాన్ని, పాఠ్యాంశాల్ని రూపొందించాలి. విద్యార్థులు కోవిడ్ లాంటి వైరస్ బారిన పడినప్పుడు వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడంతోపాటు, ఆరోగ్యం మెరుగుదల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైరస్ విస్తృతిని నిరోధించడానికి చేయవలసిన వాటిపట్ల అవగాహనను పెంచడంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థŸœ(WHO) ICMR ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ సరియైన సమాచారాన్ని అందిస్తూ వ్యాధి సోకిన పిల్లల పట్ల గాని టీచర్లు తల్లిదండ్రుల పట్ల అసహ్యించుకునే వివక్షతను ప్రదర్శించే తీరు వివరించాలి.
లి వ్యాధి వల్ల కానీ ఇతరేతర భయాలవల్ల మానసిక ఆందోళనలకు గురయ్యే విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచడానికి, హెల్త్స్క్రీనింగ్, ఫిజకల్ డిస్టెన్సింగ్, మాస్క్, క్లీన్లీనెస్తో పాటు ప్రత్యేక కార్యక్రమాలు అవగాహనలతో కొరోనా కోరలకు విద్యార్థులు, టీచర్లు చిక్కుకోకుండా బడులు తరగతి గదులు ప్రత్యేకంగా యుద్ధప్రాతిపదికన ప్రభుత్వమే సిద్ధపరచడం ద్వారా ప్రైవేట్ దవాఖానల్లా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– ప్రభాకర్ కస్తూరి, కన్వీనర్ తెలంగాణ టీచర్స్ఫోరం, Secretary Right Education for Better Society (REBS), , 9440970454