
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. గురువారం సచివాలయం సాధారణ పరిపాలన శాఖ అధికారులు, ఉద్యోగుల తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పని చేయాలని అన్నారు. సమస్యలు ఏమైన ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో గెజిటీర్స్ కమిషనర్ జి.కిషన్, జి.ఎ.డి. సంయుక్త కార్యదర్శి అర్విందర్ సింగ్ , ఉప కార్యదర్శులు దేవేందర్ రావు, చిట్టి రాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Secretary General, Government, somesh kumar, new year celebrations, cake cut