Take a fresh look at your lifestyle.

సచివాలయ భవనాల కూల్చివేతకు… పర్యావరణ అనుమతి అవసరం లేదా ?

  • సూటిగా సమాధానం ఇవ్వకుండా తెలివిగా నివేదిక ఇచ్చారు
  • కూల్చివేతపై స్టే పొడిగించిన హైకోర్టు 

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు శుక్రవారానికి పొడిగించింది. కూల్చివేత పనులను నిలిపి వేయాలని కోరుతూ టీజేఎస్‌ ఉపాధ్యక్షుడు ప్రొ.పీఎల్‌ ‌విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసిన విషయం తెలిసిందే. కూల్చివేతకు సంబంధించి పర్యావరణ అనుమతి అవసరమా ? కాదా ? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని బుధవారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు గురువారం ఈ కేసు విచారణకు హాజరైన అసిస్టెంట్‌ ‌సొలిసిటర్‌ ‌జనరల్‌  ‌జనరల్‌ ‌పీసీబీ, రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు అథారిటీ జారీ చేసిన నివేదికలకు హైకోర్టుకు సమర్పించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పకుండా తెలివిగా నివేదికలు ఇచ్చిందని మండిపడింది.

కూల్చివేతల నియమ నిబంధనలు ఎలా ఉన్నాయని తాము అడగడం లేదనీ, ప్రధానంగా పర్యావరణ నిబంధనల ప్రకారం అనుమతులు అవసరమా ? లేదా ? అనే దానిపైనే తాము స్పష్టత కోరుతున్నామని వ్యాఖ్యానించింది. తెలివిగా ఉండొద్దు, నిజాయితీ ఉండాలని సూచించింది.  దీనికి ఆయన సమాధానమిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తాము కోరిన సమాచారం ఇంకా రాలేదని హైకోర్టుకు విన్నవించారు. ఏజీ వాదనలో ధర్మాసనం విభేదిస్తూ కొత్త భవనాల నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడమంటే ఏమిటి ? కొత్త భవనాల నిర్మాణానికి సిద్ధం చేయదమే కదా ? కూల్చివేతలకు పర్యావరణ అనుమతి అవసరమా ? లేదా అని ప్రశ్నించింది. ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వం స్పందనే కీలకమని పేర్కొంది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తాము కోరిన సమాచారం రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అందువల్ల తమకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వ స్పందన కీలకమని అభిప్రాయపడిన ధర్మాసనం స్టేను ఒక రోజు పొడిగిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Leave a Reply