Take a fresh look at your lifestyle.

నేడు వైఎస్సార్‌ ఆసరా రెండో విడత ప్రారంభం

  • ఒంగోలులో ప్రారంభించనున్న సిఎం జగన్‌
  • 7 ‌నుంచి 17 వరకు జిల్లాల్లో కార్యక్రమాలు ఖరారు
  • ఆడబిడ్డలను ఆదుకుంటామన్న మాటకు కట్టబడి ఉన్నాం
  • అక్కాచెల్లెమ్మలకు లేఖ రాసిన సిఎం జగన్‌

అమరావతి,అక్టోబర్‌ 6 : ఆం‌ధ్రప్రదేశ్‌లో పేద కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం నవరత్నాల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబం ఆదాయాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెంది రాష్టాభ్రివృద్ధిలో అందరూ భాగస్వాములు కాగలుగుతారన్నారు. ఇందుకోసం ఎంతటి కష్టాలనైనా అధిగమిస్తూ తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గురువారం వైఎస్సార్‌ ఆసరా పథకం రెండో విడత డబ్బుల పంపిణీ సందర్భంగా సీఎం జగన్‌ ఈమేరకు పొదుపు సంఘాల మహిళలకు నేరుగా లేఖలు రాశారు. ప్రకాశం జిల్లాలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో వారికి బహిరంగ లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో ఆ సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది ఈ పథకం కింద మలి విడత పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 7న సీఎం జగన్‌ ఒం‌గోలులో ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 7‌వ తేదీ నుంచి 17 వరకు పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ ఆసరా ఉత్సవాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.

పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను లబ్దిదారులకు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రాణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ‌సీఈవో ఇంతియాజ్‌ ‌తెలిపారు. చల్లని ఆశీస్సులతో వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా వరుసగా రెండో సంవత్సరం ఈనెల 7వతేదీన పొదుపు సంఘాల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నామని ఎంతో సంతోషంగా తెలియచేస్తూ హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. మాది చేతల ప్రభుత్వం. మేనిఫెస్టో అంటే అంకెల గారడీ కాదు. అదొక పవిత్రమైన భగవద్గీత, బైబిల్‌, ‌ఖురాన్‌లా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం. హాల అమలుకు తేదీలవారీగా క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి మొదటి రెండేళ్లలోనే 95 శాతం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదని సిఎం పేర్కొన్నారు. పొదుపు సంఘాలు ఛిన్నాభిన్నమై ’ఏ’ గ్రేడ్‌లో ఉండే సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లలోకి పడిపోయాయి. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక ఇబ్బందులను పాదయాత్రలో స్వయంగా చూసి చలించా.

ఎన్నికల రోజు వరకు పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం ఎస్‌ఎల్‌బీసీ తుది జాబితా ప్రకారం 7.97 లక్షల సంఘాలలోని 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల అప్పు రూ.25,517 కోట్లను నాలుగు దఫాలుగా నేరుగా పొదుపు సంఘాల ఖాతాలకు అందించాలని నిర్ణయం తీసుకున్నా. దీన్ని మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలలో చేర్చాం. హాని అక్షరాలా పాటిస్తూ ఇప్పటికే మొదటి విడతగా రూ.6,318.76 కోట్లు చెల్లించాం. తద్వారా 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరింది. ఇప్పుడు మళ్లీ 78.76 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మరో రూ.6,439.52 కోట్లు రెండో విడతగా అందిస్తున్నామని పేర్కొన్నారు. జీవితాల్లో మరిన్ని కాంతులు వెల్లివిరియాలని, కుటుంబానికి సుస్ధిర ఆదాయం సమకూరాలని, కు రుగా సృష్టించుకునే వ్యాపార, జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సిఎం జగన్‌ ‌వివరించారు. కాళ్ల ద రు సొంతంగా నిలబడేలా చేసి జీవనోపాధి మెరుగుపర్చుకొనేలా గతేడాది అమూల్‌, ‌హిందూస్థాన్‌ ‌యూనిలీవర్‌, ఐటీసీ, ప్రోక్టర్‌ అం‌డ్‌ ‌గ్యాంబల్‌, అలానా లాంటి వ్యాపార దిగ్గజాలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నాం. కుటుంబ ఆదాయం పెరగడం ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర అభివృద్దిలో రు భాగస్వాములు కాగలుగుతారు. ఎంతటి కష్టాన్ని అయినా భరించి తోబుట్టువుగా ఈ కార్యక్రమాలను చేస్తున్నా. జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న కోరికను నెరవేర్చే దిశగా నా ప్రతి అడుగు వేస్తున్నా. అందరి ఆశీస్సులు నాతోపాటే ఉంటాయన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు.

Leave a Reply