Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా మలిదశ కొరోనా టీకా పంపిణీ

టీకాలు వేయించుకున్న ప్రధాని, ఉప రాష్ట్రపతి, శాస్త్రవేత్తల కృషికి ప్రధాని మోడీ అభినందన

రెండోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు టీకా వేయించుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, చెన్పైలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‌టీకా తొలి డోసు వేయించుకున్నారు. భారత్‌ ‌బయోటెక్‌ ‌తయారు చేసిన కొవాగ్జిన్‌ను ప్రధాని వేయించుకున్నారు. ఈ సందర్భంగా కొరోనాపై జరుగుతున్న పోరులో శాస్త్రవేత్తలు, డాక్టర్లు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారినా తరిమి కొట్టే క్రమంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని ఆయన కోరారు. సమష్ఠి కృషితోనే కొరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఫోటోలో ఒక నర్సు దేశీయంగా తయారైన భారత్‌ ‌బయోటెక్‌ ‌కోవాగ్జిన్‌ ‌టీకాను ప్రధానికి మోడీకి వేస్తూ కనిపిస్తున్నారు.

పీ నివేద అనే ఈ నర్సు మోదీ తనతో ఏమన్నారో తెలియజేశారు. ప్రధాని మోదీ భారత్‌ ‌బయోటెక్‌ ‌వ్యాక్సిన్‌ ‌తొలి డోసు టీకా తీసుకున్నారు. రెండవ డోసు 28 రోజుల తరువాత ఇవ్వాల్సి ఉంది. టీకా తీసుకున్న తరువాత మోదీ తనకు టీకా వేసినట్టే తెలియలేదని తనతో అన్నట్టు ఆమె తెలిపారు. కాగా నర్సు నివేద పుదుచ్చేరికి నివాసి. మోదీకి టీకా వేస్తున్నప్పుడు ఆయన వెనక కేరళకు చెందిన నర్సు ఉన్నారు. ప్రధాని మోదీకి టీకా వేయడంతో దేశ వ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైంది.

కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న వెంకయ్య.. సోమవారం ఉదయం చెన్నైలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సిన్‌ ‌తీసుకున్నారు. ఈ విషయాన్ని తన ఫొటోలతో సహా ఆయనే ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించారు. రెండో డోసును 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని వెంకయ్య తెలిపారు.

Vice President Venkaiah Naidu administered the first dose

అర్హులైన వారందరూ కోవిడ్‌ ‌వాక్సిన్‌ ‌తీసుకుని కొవిడ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మన దేశం నుంచి వివిధ దేశాలకు కొరోనా టీకా సరఫరా అవుతుండటం భారతీయుడిగా గర్విస్తున్నన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా టీకా సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఆయన చెప్పారు.

Leave a Reply