- బాధితులను ఆదుకోవడమే తక్షణ కర్తవ్యం
- వరద ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలింపు
- సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు తగవు
- వాతావరణ శాఖ హెచ్చరికలపై ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కురిసిన వాన చరిత్రలో రెండో అతి పెద్ద వర్షం అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కాపడడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని అన్నారు. అందరినీ అదుకునే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. మూసీకి వరదలు వచ్చిన 1908లో 43 సెంటివి•టర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 120 సెం.వి•. వర్షపాతం నమోదైంది అని తెలిపారు. ఇలాంటి ఉత్పాతం వందేళ్లకు ఒకసారి వస్తుందన్నారు. చరిత్రలో ఈ ఏడాదే ఎక్కువ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నాలుల, చెరువుల, కుటంల ఆక్రమణలు కారణంగానే వరద ఉధృతి తీవ్రంగా ఉందన్నారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సవి•క్ష నిర్వహించారు. వరద సహాయక చర్యలను కేటీఆర్ సవి•క్షించారు. సవి•క్ష అనంతరం మంత్రి కేటీఆర్ వి•డియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాల ప్రజలకు పునరావాల కేంద్రాలకు తరలిస్తున్నామని అన్నారు. భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్లే కాలనీలు జలమయం అయ్యాయని తెలిపారు. రెండు రోజులు తెరిపి ఇస్తే నీటిని తొలగించేందుకు వీలు ఉంటుందన్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్లకు అతి విశ్వాసం వద్దని, పునరావాస కేంద్రానికి రావాలన్నారు. కట్టుబట్టలతో వస్తే చాలు.. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు పడుతున్నాయని, క్యుములో నింబస్ మేఘాల వల్ల అధిక వర్షాలు పడుతున్నాయని, వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అన్నారు. ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని తెలిపారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నందున వర్షం పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. వరద పరిస్థితిని సవి•క్షించేందుకు 80 మంది ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తామని చెప్పారు.