Take a fresh look at your lifestyle.

వెల్దుర్తిలో రైతులు ఆందోళన..

మెదక్‌ ‌మే 4( ప్రజా తంత్ర ప్రదినిది): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవస్థలు తప్పడం లేదు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాడుతున్న అని చెబుతున్న మరోపక్క అధికారుల నిర్లక్ష్యం మూలంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు చేతికొచ్చిన పంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో తీసుకువచ్చి క్రమ సంఖ్య లో గంటల తరబడి నిలబడిన రైతులకు తిప్పలు తప్పడం లేదు తాజాగా మెదక్‌ ‌జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో రైతులు ధాన్యం కొనుగోలు చేయడానికి ఉదయం నుండి ఇ ఇబ్బందులు ఎదుర్కొన్నారు సోమవారం ఉదయం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటుచేసిన పాత తూకం యంత్రంపై వరి ఇ దాన్యం తూకం చేయగా హమాలీలు కిలోల చొప్పున తరుగు తీసేస్తున్నారు అని రైతు లు ఆరోపించారు ఎలక్ట్రానిక్‌ ‌కేంద్రంలో తూకం చేస్తే గిట్టుబాటు అవుతుందని డిమాండ్‌ ‌చేస్తూ రైతులు ధర్నాకు దిగారు దాంతో రైతులు మోసపోతున్నారు అని విమర్శించారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో ఎలక్ట్రానిక్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు వెంటనే వ్యవసాయ సహకార శాఖ సంఘం చైర్మెన్‌ అనంత రెడ్డి వెంటనే స్పందించి తూకంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు

Leave a Reply