జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను మధ్యవర్తుల సమక్షంలో విడుదల చేసిన మావోయిస్టులు
గత ఆరు రోజులుగా తమ చెరలో బందీగా ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను కుటుంబ సభ్యుల ఆవేదన తెలుసుకున్న మావోయిస్టులు గురువారం నాడు కొంతమంది మధ్యవర్తుల సమక్షంలో విడుదల చేసారు. దీనితో ఆరురోజుల పాటు ఉన్న ఛత్తీస్‌ఘఢ్ ప్రభుత్వానికి, పోలీస్ ఉన్నాతాధికారుల ఉత్కంఠకు తెరపడినట్లైంది. గోండ్వాన సమాజ అధ్యక్షులు పద్మశ్రీ ధర్మపాల్ శైనీ మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యులు మరియు వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేసారు. మధ్యవర్త్తిత్వానికి వెళ్ళిన బృందం జవాన్‌తో కలిసి భాషగుండాకు తిరిగివొచ్చారు. జవాన్ విడుదల కోసం మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరు సభ్యుల బృందంతో పాటు బస్తర్‌కు చెందిన ఏడుగురు జర్నలిస్టులు కూడ సహకరించారు. మావోయిస్టుల పిలుపుమేరకు అటవీ ప్రాంతమైన బస్తర్ ప్రాంతానికి 11 మందితో కూడిన బృందం చేరుకుని జవాన్ విడుదలకు సహాయపడ్డారు.