Take a fresh look at your lifestyle.

దళితుల పేరుతో మరో మోసానికి తెర

  • వరాలు కురిపిస్తే ప్రజలు నమ్మరు
  • ఇంటిలిజెన్స్ ‌డిఐజి చుట్టంలా పని చేస్తున్నారు
  • మిడియా సమావేశంలో ఈటల ఘాటు విమర్శలు

కేసీఆర్‌ ‌ఫోటోలు ప్లెక్సీలు, గోడల మిదనే ఉంటాయి, అవి నాలుగు రోజులు ఉంటాయి. తర్వాత పోతాయి. గెలిచేది నేనే. అటు వైపు పది మంది టికెట్స్ ‌కోసం కొట్లాడుతున్నాయి అని సీఎం కేసీఆర్‌ ‌గురించి ఈటల రాజేందర్‌ ‌వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ ‌డీఐజీ ప్రభాకర్‌ ‌రావుపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కండువా కప్పుకోవాలంటే తమకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో బుధవారం మిడియాతో మాట్లాడిన ఈటల.. కేసీఆర్‌తో పాటు ప్రభాకర్‌ ‌రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్‌ ‌రావు.. నువ్వు చట్టానికి లోబడి పని చేస్తున్నావా?.. చుట్టాలకి లోబడి పని చేస్తున్నావా?.. కేసీఆర్‌ ‌చుట్టం లెక్క పని చేస్తే ఒప్పుకోము. వందల మంది ఇంటలిజెన్స్ అధికారులు హుజూరాబాద్‌లో తిరుగుతున్నారు. నువ్వు రాజకీయాలు చేయాలంటే గులాబీ కండువా కప్పుకో. మి ఇజ్జత్‌ ‌పోతుంది. మిమ్మల్ని చూసి ప్రజలు అసహ్యపడుతున్నారు. ఎన్నికల అప్పుడు ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారని ఈటల వ్యాఖ్యానించారు. ఈటల గెలిస్తేనే తెలంగాణ గెలుస్తుందని బయట ఉన్నవారు చెప్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు హామిలతో మభ్యపెట్టి గెలవడమే తెరాసకు తెలుసు. ‘ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కొందరు పోలీసులు చట్టాలకు లోబడి కాకుండా చుట్టాలకు లోబడి చేస్తున్నారని ఈటల విమర్శించారు. వడ్లు కొనండి అని చెప్పిన. అది తప్పా?.. అది తిరుగుబాటా?.. 88 సభ్యులు ఉన్నా మళ్లీ కొత్తవారిని ఎందుకు చేర్చుకున్నారు? కేసీఆర్‌ ‌కుట్ర దారు. నేను ప్రజల కోసం పని చేస్తా‘ అని ఈటల పేర్కొన్నారు.

తమ సొమ్ముతో సీఎం కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ‌సోకులు పడుతున్నారని ఈటల రాజేందర్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజీనామాతోనైనా పెన్షన్లు, రేషన్‌ ‌కార్డులు ఇస్తారని ఆశిస్తే.. అది కూడా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దొరల దగ్గర భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సిగరెట్‌ ‌పెట్టె ముక్కల మిద, తెల్ల కాగితాల మిద భూములు ఇచ్చారు. దొరల మనవళ్లు ఆ భూముల మిదకు వొస్తున్నారు. 50 వేలో, లక్షో ఇచ్చి తిరిగి రిజిస్ట్రేషన్‌ ‌చేసుకుంటున్నారు. ఎన్ని లక్షల మంది యువకులకు ఉపాధి ఇచ్చారో చెప్పగలరా? దళిత జాతిని ఆదుకునే ప్లాన్‌ ‌చెయ్యలేదు. దళిత జాతిని మోసం చేసే ప్లాన్‌ ‌చేస్తున్నారు. దళితులకు భూమి పథకం సక్సెస్‌ ‌కాదని చెప్పిన. ఆ పథకం వల్ల ఎంత మంది బాగుపడ్డారు? న్యూస్‌లో వేయించుకుని సంబర పడ్డారు. నా మిద కడియం, హరీష్‌ ‌మాట్లాడితే బాధగా ఉంది. డబుల్‌ ‌బెడ్‌రూమ్‌లు సిరిసిల్లలో, సిద్దిపేటలో కట్టారు తప్ప ఎక్కడా కట్టలేదు. ఏడేండ్లు అయినా పేదల కల నెరవేరడం లేదని చెప్పిన. కేసీఆర్‌ ‌చెప్పిందే వేదం తప్ప ఇతరుల మాటలకు విలువ లేదు. నేను కూడా పెదవి మూసుకున్నా అనొచ్చు.

కానీ ఇక నా వల్ల కాలేదు. దళిత, యాదవ, వైశ్య, భవనాలు ఒక్క హుజురాబాద్‌లోనే ఎందుకు ప్రకటిస్తున్నారని, రాష్ట్రమంతా ఇవ్వండని ఈటల అన్నారు. తెలంగాణలో మరోసారి దళితులను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అందరికీ అందుతున్న పథకాలే ఎస్సీలకు అందుతున్నాయన్నారు. ఏ జాతి వల్ల పదవి దక్కిందో వారిని అగౌరవ పరచొద్దని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారన్నారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ఎందరో ఎస్సీలకు అన్యాయం జరిగింది. తెల్ల కాగితంపై రాసుకుని కొనుగోలు చేసిన భూములు మళ్లీ దొరలకే వెళ్లాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు పాసు పుస్తకాలు రాకపోవడంతో ఇబ్బంది పడ్డారు.

చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడేళ్లలో ఎస్సీలకు ఎంతో చేసి ఉండొచ్చు. హుజూరాబాద్‌ ‌సహా ఇతర నియోజకవర్గాల్లో ఇళ్లు పూర్తి కాలేదు.మంత్రులు, పార్టీ నేతలకు విలువ ఇచ్చే సంస్కారం తెరాసలో లేదన్నారు. ఎన్నడు లేని విధంగా అనేక వర్గాల ప్రజల మిద కేసీఆర్‌కు ప్రేమ పుట్టుకు వస్తుందని మాజీమంత్రి ఈటల విమర్శించారు. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ఉంది. వైద్యం విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆరోపించారు. తాను ఆ శాఖ నుండి బయటికి వొచ్చిన తర్వాత అనేక జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక కేసీఆర్‌ను ఫామ్‌ ‌హౌజ్‌ ‌నుండి పరుగులు పెట్టిస్తుందని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేధావుల అభిప్రాయాలు అవసరం కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. సీఎం ఆఫీసులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు లేదని ఆరోపించారు. కొంతమంది బానిసలుగా వ్యవహరించడం వల్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. రెవిన్యూ రిఫామ్స్ అని చెప్పి కబ్జా కాలం నుండి పేరు తీసి వేస్తే, దళితులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసామని ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి కొని ఇవ్వడం సాధ్యం కాదని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు.

Leave a Reply