Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌పార్టీకి సింధియా రాజీనామా..

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. అంతకుముందు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో, ప్రధాని మోదీతో  భేటీ అయ్యారు.

సింధియాతోపాటు 17మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ‌పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీంతో కమల్‌నాథ్‌ ‌సర్కార్‌ ‌మైనారిటీలో పడింది. ఇక ఆ ప్రభుత్వం నిలిచే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.

Leave a Reply