Take a fresh look at your lifestyle.

శాస్త్రవేత్తలు .. సృజనాత్మకంగా ఆలోచించాలి: ప్రధాని మోడీ

Scientists Think creatively narendra modi
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మార్పు అవసరం
ఇండియన్‌ ‌సైన్స్ ‌కాంగ్రెస్‌ ‌సదస్సు ప్రారంభించిన ప్రధాని మోడీ

బెంగళూరు: యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 107వ ఇండియన్‌ ‌సైన్స్ ‌కాంగ్రెస్‌ ‌సదస్సును శుక్రవారం మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరాన్ని సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ, ఆవిష్కరణల కార్యక్రమంతో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు.‘‘శాస్త్ర, సాంకేతిక రంగం విజయాలపై దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరింత అవసరం. యువ శాస్త్రవేత్తలకు నా నినాదం ఒక్కటే.. సృజనాత్మకత, హక్కు, ఉత్పత్తి, విజయం.. ఈ నాలుగు అడుగులు దేశాన్ని ప్రగతి పథాన వేగంగా నడిపిస్తాయి. మనం ఏదైనా సృష్టిస్తే దానిపై మనకు హక్కు ఉంటుంది. అది మన ఉత్పత్తి మార్గాలను సరళతరం చేస్తుంది. ఆ ఉత్పత్తులను ప్రజలకు చేరేలా చేస్తే అప్పుడు విజయం సాధించినట్లు అవుతుంది. ప్రజల కొరకు ప్రజల చేత ఆవిష్కరణెళి సరికొత్త భారతానికి మార్గదర్శకం‘ అని మోడీ పేర్కొన్నారు.

ప్రపంచ సృజనాత్మకత సూచీలో భారత్‌ 52‌వ స్థానానికి మెరుగుపడటం ఆనందంగా ఉందని మోడీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో మన శాస్త్రవేత్తలు పురోగతి సాధిస్తున్నారని అభినందించారు.  అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన పురోగతితో.. ఇప్పుడు మనం సముద్ర అన్వేషణపై పెట్టాలన్నారు. సముద్రాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర వనరులను అధ్యయనం చేయాలన్నారు. గ్రాణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పిన ప్రధాని.. ఇందుకోసం గత ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పుడు రైతులు దళారులతో ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పారు.

Tags: narendramodi, Scientists, Think creatively, narendra modi young Scientists, 107th indian science congress

Leave a Reply