వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సైన్స్‌సెంటర్లతో విజ్ఞానాభివృద్ధి ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

February 12, 2020

Science development with sciencecenters Finance Minister Tanneer Harish Rao
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సైన్స్ ‌సెంటర్‌,‌యోగాభవన్‌కు శంకుస్థాపన

పరిశీలించు, పరిశోదించు, ప్రశ్నించు నిర్దారించు అనేదే సైన్స్ ‌కు నిర్వచనమని, జిల్లా కేంద్రంలో ఇలాంటి సైన్స్ ‌మ్యూజియం నకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకంగా ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తనీరు హరీష్‌ ‌రావు అన్నారు. బిర్లా సైన్స్ ‌మ్యూజియం ధీటుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సైన్స్ ‌సెంటర్‌ ‌విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా పాత డి.ఆర్‌.‌డి.ఏ. కార్యాలయ ప్రాంగణంలో కోటి 40 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న సైన్స్ ‌కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అలాగే 80 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న యోగ భవనానికి మంత్రి శంఖు స్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సైన్స్ ‌మ్యూజియం వలన పిల్లలలో జ్ఞానం పెంపొందుతుండడని, ఉపాధ్యాయులతో అవగాహన మెరుగవుతుందని, జ్ఞానాన్ని సముపార్జించుటకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇట్టి మ్యూజియం ను మన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముదాహమని అన్నారు.అనంతరము యోగ భవన్‌ ‌కు శంకుస్థాపన చేసిన్నారు .ఈ కార్యక్రమములో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రతి రోజు యోగ చేసినందువలన మనిషి ఆరోగ్యము ఉంటారన్నారు . ఆహారపు అలవాట్లు ఆరోగ్య అలవాట్లు మనిషి ప్రతిరోజు జీవితములో మానసిక ఒత్తిడి పెరిగే పోతున్నాయని, జీవనవిధానం మారిందని, దానికి తగినట్లు మన ఆహారపు అలవాట్లు మారాలని దాని కి అనుగుణంగా యోగ లాంటి కార్యక్రమాలు అలవాటు పడితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు. యోగ విద్యార్ది దిశ నుండి మన పిల్లలు కు అలవాటు చేయటం వలన చదువు లో మానసిక వత్తిడి తగుతుందని అన్నారు.

మార్కులు ర్యానకులతో పాటు ప్రాణయమము యోగా వంటివి నేర్పాలని సూచించారు. ఆరోగ్యంతో పాటు సామజిక భద్యత కూడా ఉంటుందని అన్నారు.జిల్లా కలెక్టర్‌ ఎం ‌హనుమంతరావు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగ చాల అవసరము అన్నారు .యోగ భవనము నాకు మంత్రి గారు అడిగిన వెంటనే ఇది తక్షణము అవసరము అని నిధులు మంజూరు చేయడము జరిగింది అన్నారు. నిత్య జీవితము లో ఎన్నో వత్తిడి లకు తట్టు కోవడానికి ఒకే ఒక్క మార్గము యోగ ఇది శారీరకంగా మానసికముగా పని వత్తిడిని తగిచేది యోగ మాత్రమై జిల్లా లో అందరము యోగ లో జాయిన్‌ అయ్యే ఆరోగ్యము మెరుగు పరుచుకొని ఆరోగ్య సమాజము ఆరోగ్య సంగారెడ్డి ని మనము నిర్మిద్దాము అన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా జెడ్‌ .‌పి. చైర్మన్‌ .‌మంజు శ్రీ ఎం .పి.బిబి పాటిల్‌, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ,‌రాజశ్రీ షా,డి పి ఓ వెంకటేశ్వర్లు. డి ఆర్‌.‌డి ఏ .శ్రీనివాస్‌, ఆర్‌ .‌డి.ఓ నగేష్‌. ‌జిల్లా లో ని సంబంధిత అధికారులు పాల్గొన్నారు.