Take a fresh look at your lifestyle.

ఈనెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభించుకోవచ్చు

తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాలదే
మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ఈనెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభించుకోవచ్చని కేంద్ర విద్యా శాఖ నిబంధనలు విడుదల చేసింది. అయితే, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పాఠశాలల ప్రారంభంపై అక్కడి ప్రభుత్వాలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం వంటి నియమాలు తప్పనిసరిగా చేస్తూ పాఠశాలలను ప్రారంభించాలని పేర్కొంది. ఈమేరకు సోమవారం కోవిడ్‌ 19 ‌కారణంగా మూతపడిన విద్యా సంస్థల ప్రారంభంపై రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. ఈనెల 15 నుంచి పాఠశాలలను ప్రారంభించుకోవచ్చని కేంద్ర హోం శాఖ సూచనలకు అనుగుణంగా కేంద్ర విద్యా శాఖ నిబంధనలు విడుదల చేసింది. కాగా, కొరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి విద్యా సంస్థలు మూతపడ్డాయి.

సుమారు ఏడు నెలల సుదీర్ఘ కాలంగా విద్యా సంస్థలు తెరుచుకోలేదు. అయితే, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలను తిరిగి తెరవాలనే డిమాండ్‌ ‌పెరిగిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా, ఆయా రాష్ట్రాలలో కోవిడ్‌ ‌కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, పాఠశాలలు, కోచింగ్‌ ‌సెంటర్లను పూర్తిగా శానిటైజ్‌ ‌చేయాలనీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ విధిగా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. అలాగే, తల్లిదండ్రులు రాతపూర్వకంగా అనుమతించిన విద్యార్థులు మాత్రమే పాఠశాలలో తరగతులు హాజరయ్యేందుకు వీలు కలుగుతుంది. కాగా, ఈనెల 15 నుంచి పాఠశాల ప్రారంభంపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఓ ‌ప్రకటన చేస్తూ హాజరు కోసం విద్యార్థులపై నిర్బంధం ఉండదని స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply