Take a fresh look at your lifestyle.

సంక్రాంతి సెలవుల్లో బడులు తెరిచే ఉంటాయి

తెలంగాణలో విద్యా సంస్థలకు ప్రభుత్వం జనవ రి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ప్రకటించినప్పటికీ, చాలా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తమ సంస్థలను షెడ్యూల్ ప్రకారం తెరిచి ఉంచాలని నిర్ణయించాయి. నిర్ణీత తేదీల్లో విద్యార్దులు పాఠశాలలు, కాలేజీలు మానకుండా చూసేందుకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఆదివారాలైనా, ప్రభుత్వ సెలవులైనా, పండుగలైనా సరే మా అమ్మాయి రోజూ కాలేజీకి వెళ్ళాల్సి వస్తోంది, విచారం ఏమిటంటే, క్రిస్మస్ రోజున ఆమె పరీక్షకు వెళ్ళాల్సి వచ్చింది. సంక్రాంతి పండుగ రోజున కూడా ఆమె కాలేజీకి వెళ్లాల్సిందే. జనవరి 13వ తేదీ వరకూ కాలేజీకి వెళ్ళాల్సిందేనని ఒక తండ్రి వ ాపోయారు.ఆయన కుమార్తె ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ టెస్టులు పోటీ పరీక్షలు ఈ టెస్ట్ లకు వారు రోజూ హాజరు కావల్సిందేనని ఆయన అన్నారు. పదవ తరగతి విద్యార్దుల తల్లితండ్రులు కూడా ఇదే మాదిరి ఫిర్యాదు చేశారు. పాఠశాలలు, విద్యా సంస్థలు పిల్లలు ఆయా పాఠ్యాంశాలను అర్ధం చేసుకుంటున్నారా లేదా అనేది పట్టించుకోవడం లేదు. తమ విద్యార్ధులు ఎక్కువ మార్కులు సాధించడమే లక్ష్యంగా వారు సంస్థలను నడుపుతున్నారు.

తమ లక్ష్యాలను సాధించేందుకు విద్యా సంస్థల యాజమాన్యాలు పిల్లలను తరగతులకు ఉదయం, సాయంత్రం, ఆఖరికి పండుగ రోజుల్లో కూడా హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారని కె సురేష్ కుమార్ అన్నారు .ఆయన కుమార్తె పదవ తరగతి చదువుతోంది. తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం (టిపిటిఎఫ్ ) సభ్యులు తల్లి తండ్రుల ఆవేదన సరైనదేనంటున్నారు. సంక్రాంతి సెలవుల్లో రాష్ట్రంలో కనీసం 50 శాతం పాఠశాలలు తరగతులను నిర్వహించాలని నిర్ణయించాయి 70 నుంచి 80 శాతం పాఠశాలలు పదవ తరగతి విద్యా్ర్ధినీ విద్యార్ధులకు రివిజన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించగా, 50 శాతం స్కూల్సు పండుగ సెలవల్లో తెరిచి ఉంచాలని నిర్ణయించాయని టిపిటిఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు షబ్బీర్ అన్నారు. అన్ని పాఠశాలలు సిలబస్ ను ఇప్పటికే పూర్తి చేశాయని ఆయన చెప్పారు. విద్యా (పని)దినాలకు నష్టం వచ్చిందని సెలవుల్లో కూడా పని చేయాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయలేవని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా పని దినాలకు నష్టం వచ్చిందని చాలా యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రైవేటు టీచర్ ఫోరం ప్రతినిధులు సోమవారం విద్యా శాఖ అధికారులను కలవాలని నిర్ణయించారు. విద్యాశాఖ అధికారులకు ఒక వినతి పత్రం సమర్పిస్తారు. జనవరి 11 నుంచి 17 వరకూ స్కూళ్ళను తెరిచి ఉంచాలన్న స్కూళ్ళ యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేయనున్నారు.

Tags: Schools are open, sankranti holidays, hiliday list, telangana

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy