Take a fresh look at your lifestyle.

పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై సర్వ సన్నద్ధం కావాలి

– సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో 21న  దిశానిర్దేశం చేయనున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్ రావు

పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభ సర్వ సన్నద్ధంపై ఈ నెల 21వ తేదీ గురువారం సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేయనున్నారని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో సన్నద్ధత ఏర్పాట్ల అవగాహన సదస్సును సమీక్షించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను పునః ప్రారంభానికి ముందస్తుగా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో పక్కగా ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9వ తరగతి, ఆపై తరగతులకు విద్యా సంస్థల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేసేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.

ప్రత్యేకించి ఈ అవగాహన సదస్సు సమావేశానికి జిల్లాలోని ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఏంపీడీఓలు, ఏంపీఓలు, మండల విద్యాధికారులు, డీపీఓ, డీఏంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, అన్నీ సంక్షేమ శాఖలకు చెందిన వెల్ఫేర్ అధికారులు, అన్నీ సంక్షేమ శాఖలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హెచ్ డబ్ల్యూఓలు, అన్నీ రకాల రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, కేజీబీవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, జెడ్పీటీసీలు, ఏంపీటీసీలు హాజరు కావాలని కోరారు. కోవిడ్ తరగతుల నిర్వహణ పై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిపి మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. విద్యాసంస్థలు పునఃప్రారంభ ప్రక్రియపై జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న అవగాహన సదస్సు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరు కానున్న దృష్ట్యా విద్యాశాఖ అధికారులు, ఇతర బాధ్యులు సమగ్ర తాజా సమాచారంతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Leave a Reply