Take a fresh look at your lifestyle.

‘‘‌పంతుళ్ళయి పానాలు గాదా యేంది’’!?

“పిలగాండ్లు లేని బళ్ళకు సుతపంతుళ్ళను పోవాలనుడు పది గల్ల మాస్కులు మూతికి గట్టుకోని పంకాల కిందికేలి కదులకుంటుండే పెద్దసార్లు అటురుకు!ఇటురుకు! అని పంతుళ్ళను పిలగాండ్ల ఇండ్లకు పంపబడ్తిరి. యేమన్నంటె పై నుంచి ఆర్డరచ్చిందనబట్టె!వారం దినాలకే వందల మంది పంతుళ్ళు కరోనా బీమారి తోని అడ్డం బడ్డరు. ఇ.హెచ్‌.ఎస్‌.‌సౌలత్‌ ‌కింద వైద్ధెం జేయమంటె నోరిప్పని సర్కార్‌,ఇప్పటికే షెక్కెర ,బి.పి,కిడ్నీ, బీమార్లు,గుండెకు స్టంట్లు బడి,ఆపరేషన్‌ అయిన పెద్ద వయిసున్న పంతుళ్ళకు సెలవియ్యమంటె నోరిప్పని సర్కార్‌ ‌పంతుళ్ళ పానాలతోని పరాశికాలాడుతాంది.పంతుళ్ళ పానాలెట్ల గింతగనం అగ్వసగ్వ కానత్తానయి?.”

Vikramarkuduవారం దినాల ఆన్‌ ‌లైన్‌ ‌సదువు లేందోగని పంతుళ్ళ పానాలను బలిబెట్టే జాతర తీర్గున్నది.కాశికి పొయినోడు,కాటికి పొయినోడు ఒకటే!అనేది!పాతవడ్డ సామెత.గిప్పుడు బడికి పోయేటి పంతుళ్ళ ముచ్చట గాడికే అచ్చింది.ఒక్క వరంగల్‌ ‌పట్నంల లెక్క జూడబోతనే ఐదొందల మంది పంతుళ్ళకు కొరోనా బీమారి సోకింది.ఏ బళ్ళె జూడ బొయినా సగంమంది పంతుళ్ళకు కొరోనా తగులుకున్నది.కొరోనాలాక్‌ ‌డౌన్‌ ‌తోని ఐదు నెల్లు గల్మ దాటకుంటున్న పంతుళ్ళను ‘‘ఛలో!బడి కి జావ్‌’’! అని సర్కార్‌ ఓ ఆగమాగం ఫర్మానిడిషింది.’’ ఛలో!యియాల్టి సంది పంతుళ్ళంత పెద్దపులినోట్లె తలకాయ్‌ ‌పెట్టాలె’’!అన్నట్టున్నది. పిలగాండ్లే రాని బళ్ళకు పంతుళ్ళు పోయి యేంజేత్తరన్న సోయి సర్కార్‌ ‌కు లేకపాయె!’’జెప్పెటోనికి శెవుటైతె ఇనెటోనికి ఇజ్జతుండాలె’’బడికి బోయి యేం జేయాల్నంటె ‘‘పిలగాండ్లు టి.వీ లల్ల,ఫోన్‌ ‌లల్ల పాటాలింటాండ్లా లేదా! జూడాలె’’! అంటిరి.గదెందో పంతుళ్ళు యెవలింటికాడ గాళ్ళు ఫోన్ల మీద జేసుడు గాదా! పిలగాండ్లు పాటాలిన కుంటె పంతుళ్ళదే బాద్దెతని బడి సర్కార్‌ ‘‘‌బెదిరిచ్చే’’ కతలు వడ్తాండె! బెదిరిచ్చుడ్ల తోని సర్కార్‌ ‌నడిపేటి ఆన్‌ ‌లైన్‌ ‌సదువులేపాటి ఫలితాలిత్తయనేది జూడాలె!

కొరోనా కాలంల ఎమ్మెల్లేలు గల్మ దాటుతె పి.పి.టి ముసుగులేసుకుంటాండ్లు.మరి పంతుళ్ళకున్నయా!?బడికి బోవుడంటె వుట్టి ముచ్చటానుల్లా! బండి దీశి గిర్రు వంటె రొండు సందులవుతలన్నట్టు గాదాయె!శాన మంది పంతుళ్ళు,పంతులమ్మలు పొద్దటి పాసెంజర్‌ ‌బందాయె!దొరికిన రైలుబండెక్కి ఆగినకాడ దిగాలె!అటెంక షేరింగ్‌ ఆటో లెక్కాలె!బస్సులు దొరికిచ్చుకునుడు తిప్పలు శిన్నదేం కాదు సుమీ!వేల రూపాలు బెట్టి జీబులు,కార్లు మాట్లాడుకోని పక్కపక్కన గూసోని పోవుడచ్చుడు సుత బుగులే! పంతుళ్ళ పానాలు కొరోనా కంట్లబడి గాళ్ళు గాందిదావకాన తొవ్వ బట్టుడు గిట్ల గావచ్చన్న బుగులే ముందుగాల పానాలు దీయబట్టె! ‘‘మొండోడు రాజు కన్న బలవంతు’’డని శాత్రముండె గద!రాజే మొండోడైతె!గిప్పుడేం గావాలె!సర్కార్‌ ‌యవారం గిట్నే మోపయింది.సర్కార్‌ ‌పిలగాండ్లు లేకుంట బళ్ళుతీసుడు గీ తీర్గనే కానత్తాంది.టీ.వీ.లల్ల ,పోన్‌ ‌లల్ల వచ్చేటి పాటాలు సుత ఇంగిలీషు మీడియం ల సద్వేటి పిలగాండ్లకు లేనే లెవ్వాయె! తెలుగు బాసల సద్వేటి పిలగాండ్ల కోసమే రాబట్టె! సర్కార్‌ ‌జేశిందేందంటె ‘‘అండ్లదండ్ల కూరం’’డి సగం మందికే బంతులేశినట్టు గొడ్తాంది.

నెలకు ఐదు వందలు టీ.వీ.కనెచ్చన్‌ ‌కు బెట్టి, లేకుంటె ఐదారు వేలు బెట్టి స్మార్ట్ ‌పోన్‌ ‌కొనె తాహతున్నాళ్ళు సర్కార్‌ ‌బళ్ళె పిలగాండ్లను జేరుత్తరా!? ఇయాల పని దొరుకుతె తప్ప మాపటీల్కి బువ్వ తినలేని గరీబు బతుకుల నుంచి తప్ప యింకెవ్వలు సర్కార్‌ ‌బడి తొవ్వ తొక్కరని సర్కార్‌ ‌కు తెల్వని శిత్రమా!. తిండి లేక గిన్నెలు కొట్లాడే గరీబోళ్ళ పిలగాండ్లకు టీ.వీ. స్మార్ట్ ‌ఫోన్‌ ‌సౌలతులు వుండయని సర్వేలన్నీ జెప్పినయిగ! గీ యన్నీ తెల్శిసుత గాళ్ళకు డిజిటల్‌ ‌పాటాలు జెప్పాలనే ఇకమత్‌ ‌కొస్సెట్లెల్లేది సర్కార్‌ ‌కు తెల్వందేం గాదుల్లా! సర్కార్‌ ‌దినాం ఆడేటి లచ్చా తొంబైగారడాటలల్ల ఇదో కొత్త గారడాట.

దీనికి పంతుళ్ళను బకరా జేసుడేందో సమజైతలేదు. పిలగాండ్లు రాని ‘‘‘శిత్రాల బడి శాలై వారం దినాలు గాక ముందే వందలమంది పంతుళ్ళకు కరోనా బీమారి సోకింది. గాళ్ళ పానాల సంగతేందన్న సోయి సర్కార్‌ ‌కు లేకుంట బాయె!’’పంతుళ్ళు గిట్ల కరోనా తోని జీవిడిత్తె యాబయి లచ్చలియ్యాలె’’!’’గా యింట్లెకేలి ఒకలికి సర్కార్‌ ‌నౌకరియ్యాల’’!ని పంతుళ్ళ సంఘాలన బట్టినయి గని పిలగాండ్లే లేని గీ తాకట్ల బళ్ళు నడుపుడద్దని జెప్పక బాయె! మాస్క్ ‌లేసుకోని శానిటైజర్‌ ‌రాసుకుంటె కొరోనా రానని గిట్ల మతులబు జేషిందా!మూతికి ఒక్కటి గాదుల్లా!నాల్గు మాస్కులు గట్టుకున్నా!బకీట్ల శానిటైజర్ల నింపుకోని పొద్దు మాపు తానం బోసుకున్నా కరోనా రాదని యేం లేదుల్లా! రావాలనుకుంటె దాన్ని ఆపెతరం ఎవలికి లేదని అందరికి మాగనే యెరుకైంది. ‘‘ఈ యేడు యెట్లజేషి బడిసదువులు శాలు జేషినం’’ అని జెప్పుకోనీకి సర్కార్‌ ‌షానిగ ముందు వడ్డది గని యెనుకచ్చేటి తిప్పలేందో జూసుకోలే! వైద్ధె,ఆరోగ్గె శాకోళ్ళు పి.పి.టి. ముసుగులేసుకోంది వూర్లె అడుగు వెడ్తలేరు. మరి పంతుళ్ళకు యెసొంటి పి.పి.టి. ముసుగులు ఇచ్చిండ్లని వూర్లెకు తోలుతాండ్లు.? పిలగాండ్లు టీ.వీ.ల యేంజూడ బట్టిండ్లో వాళ్ళ ఇండ్లకు బోయి ఫోట్వొలు దిగి పంపాలని పైనుంచి ఫర్మానలియ్యబడ్తిరి.

పిలగాండ్లు లేని బళ్ళకు సుతపంతుళ్ళను పోవాలనుడు పది గల్ల మాస్కులు మూతికి గట్టుకోని పంకాల కిందికేలి కదులకుంటుండే పెద్దసార్లు అటురుకు!ఇటురుకు! అని పంతుళ్ళను పిలగాండ్ల ఇండ్లకు పంపబడ్తిరి. యేమన్నంటె పై నుంచి ఆర్డరచ్చిందనబట్టె!వారం దినాలకే వందల మంది పంతుళ్ళు కరోనా బీమారి తోని అడ్డం బడ్డరు. ఇ.హెచ్‌.ఎస్‌.‌సౌలత్‌ ‌కింద వైద్ధెం జేయమంటె నోరిప్పని సర్కార్‌,ఇప్పటికే షెక్కెర ,బి.పి,కిడ్నీ, బీమార్లు,గుండెకు స్టంట్లు బడి,ఆపరేషన్‌ అయిన పెద్ద వయిసున్న పంతుళ్ళకు సెలవియ్యమంటె నోరిప్పని సర్కార్‌ ‌పంతుళ్ళ పానాలతోని పరాశికాలాడుతాంది.పంతుళ్ళ పానాలెట్ల గింతగనం అగ్వసగ్వ కానత్తానయి?

సర్కార్‌ ‌బళ్ళె సదివే గరీబోళ్ళ పిలగాండ్లకు సౌలతులుండయి గాబట్టి ఆన్‌ ‌లైన్‌ ‌సదువులంటె వుల్లేకల కతలయితయని సర్వేలు జెప్పె! ఈ సర్వేలను జెప్పిన మీడియోళ్ళే గిప్పుడు సర్కార్‌ ‌సంకెక్కిండ్లు. ఆన్‌ ‌లైన్‌ ‌సదువులు మస్తు నడ్వబట్టినయనేటి సర్కార్‌ ‌పాటకు వంత పాడబట్టిండ్లు. ఆరేండ్ల సంది పంతుళ్ళకు పదోన్నతులు లేకపాయె! జీతాలు,డి.ఏ,లు పెంచేటి ముచ్చటే మర్శిండ్లు.కొరొనా కాలంల ఎగ్గొట్టిన మూడునెల్ల సగం జీతాలేడబొయినయో! యేందో! తెల్వకపాయె! సర్కార్‌ ఇం‌త ‘గంజిల ఈగో’లిగె పంతుళ్ళను తీషి పారేయ్యబట్టింది.అయినా సుత పంతుళ్ళు కొరోనా బుసలు గొట్టే ఊళ్లళ్ళకుకు పోయి పిల్లగాండ్లను కల్వబట్టిండ్లు.ఆన్‌ ‌లైన్‌ ‌పాటాలంటె ఇంట్లకేలి బయిటికి పోకుంట పానాలు కాపాడుకుంట సదివేటియి గద!. మరి పంతుళ్ళను బళ్ళకు రావాలె!పిలగాండ్ల ఇండ్లపొంటి తిరుగాలె!వాళ్ళు టీ.వీ.సదువులు సద్వకుంటె పంతుళ్ళదే బాద్ధెతని జెప్పుడేంది!?పంతుళ్ళ పానాలు ఉప్పు పుట్నాలోలిగె కానత్తానయా! ఊరూర్లె పంతుళ్ళ పీనుగలు సావుపాట పాడుతె ఆన్‌ ‌లైన్‌ ‌సదువులు మస్త్ ‌బగ్గ జెప్పబట్టిన మని సంకలు గుద్దుకునేటి సర్కార్‌ ‌సోయి తప్పి నడ్వబట్టిందని జనం తెల్సుకోవాలె! పంతుళ్ళ గండానికే బళ్ళు తెరిషిండ్లని సర్కార్‌ ‌ను సమాజం సుత నిలేషే మోపు గావాలె!

సూడ్రా!బయ్‌!ఇ‌క్రమార్క్!
ఇం‌టివి కద! ఆన్‌ ‌లైన్‌ ‌సదువులు బెట్టిందే ఎవలింట్ల వాళ్ళుండి సదువాలని గదా!.అసొంటప్పుడు పంతుళ్ళను బళ్ళకు జావ్‌! అనుడేంది! పిలగాండ్లు ఇంటి కాన్నించి జూషినప్పుడు పంతుళ్ళు ఇంటి కాన్నించి జెప్ప వశం గాదా యేంది!ఈ ఇచ్ఛంత్రమేందో సమ్జాయించాలె!? లేకుంటె నువు పాజిటివ్‌ ‌తీర్గ కానత్తానవని సోషల్‌ ‌మీడియాల బెడ్త!అని బెదిరిచ్చేటి భేతాళున్ని యెప్పటి తీర్గనే భుజాన మోసుకుంట’’ ఇను!భేతాళ్‌!’’ఎమ్మెల్లేలు, మంత్రులు,కలెక్టర్లు,పెద్దాపీసర్లు అంత కిందుండే జీహుజూర్లే! అంతా ఏక్‌ ‌నిరంజన్‌! ‌కల్వకుంట్ల నవాబుకు యేం తోయదాయె!ఇంకోలు జెపితె ఇనడాయె!వేలల్ల వొయ్యలు కిందికి మీదికి తిప్పి సదివినోళ్ళు యేంజెప్పినా,యెట్లున్నా కానూనే! అయితది. అని నవ్వుకుంట. నడ్వబట్టిండు…నడ్వబట్టిండు…
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply