దేశంలో సెప్టెంబర్ 1అన్ లాక్-4న ప్రారంభం కానుండగా, స్కూళ్లు తెరుస్తారనే ప్రచారం జరిగింది. అయితే కొరోనా నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు.
దీంతో ఈ నిర్ణయంపై పునరాలోచన చేసిన కేంద్రం అన్లాక్-4లో స్కూళ్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు. దేశంలో ఇప్పట్లో స్కూళ్లు తెరిచే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.