మొదటి విడత నాడు-నేడు పనులు ప్రజలకు అంకితం
నాడు-నేడు కార్యక్రమంపై సక్షలో సిఎం జగన్ వెల్లడి
16న పండగలా కార్యక్రమం నిర్వహిస్తామన్న మంత్రి సురేశ్
అమరావతి,జూలై23 : ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని.. అప్పుడేమొదటి విడత నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. పాఠశాలలు పునఃప్రారంభించిననాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక.. నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా వివరిస్తుందని సీఎం జగన్ తెలిపారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించిన నాడే విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా అందజేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. తొలి విడత నాడు-నేడు కింద 15వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దాం. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను.. ఆగస్టు 16న ప్రారంభిస్తాం. విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నామని తెలిపారు. ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలి విడత నాడు-నేడు కింద 15 వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను ప్రారంభిస్తామని, విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు మంచి విద్యావ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ఆగస్టు 16న నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని పేర్కొన్నారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పక్రియ పూర్తి చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.