Take a fresh look at your lifestyle.

జూలై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాల తరగతులు

స్పష్టం చేసిన సిఎం కెసిఆర్‌…‌మంత్రి సబితకు ఆదేశాలు
జులై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేవి• లేదని కేసీఆర్‌ అన్నారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. వెంటనే ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జూలై 1 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ శనివారం మరోసారి స్పష్టం చేసింది. అయితే ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పట్లో ప్రత్యక్ష బోధనకు తొందరేవి• లేదని సిఎం తెలిపారు. వెంటనే ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.

50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలన్నారు. ఇటీవలే తెలంగాణలో లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు ఎత్తివేశారు. ఆ సమయంలో..రాష్ట్ర ప్రభుత్వం జులై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతిచ్చింది. అయితే స్కూళ్లలో ప్రత్యక్ష బోధనా.. ఆన్‌ ‌లైన్‌ ‌బోధనా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. సీఎం కేసీఆర్‌ ‌ప్రకటనతో ఆన్‌ ‌లైన్‌ ‌బోధనే అనేది స్పష్టం అయ్యింది. అంతకు ముందు ఇదే విషయంపై..ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

కొరోనా దృష్ట్యా పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వేయిదా వేయాలని, ఆన్‌ ‌లైన్‌లోనే విద్యా బోధన కొనసాగించాలని సీఎంను కోరారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఆదేశించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల తరగతులపై విద్యాశాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply