వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

స్కాలర్‌షిప్‌ ‌దరఖాస్తులు చేసుకోవాలి

February 4, 2020

SC, ST, BC, EBC, Minority, Disabled Fresh Renewal student

2019-20 విద్యా సంవత్సరానికి పోస్టు మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌ ‌కొరకు విద్యార్థులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి నాగలేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనార్టీ, డిసెబుల్డ్ ‌ఫ్రెష్‌ రెన్యువల్‌ ‌విద్యార్థిని విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు తమ దరఖాస్తులను ఈపాస్‌ ‌వెబ్‌సైట్‌ ‌నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతు అర్హులైన విద్యార్థిని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే విధంగా సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ ‌చర్యలు తీసుకోవాలని సంక్షేమాధికారి కోరారు.