Take a fresh look at your lifestyle.

స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌

  • ‌విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
  • రాష్ట్రంలో 12 స్థానాలకు జరుగనున్న ఎన్నికలు
  • 16న నోటిఫికేషన్‌..‌డిసెంబర్‌ 10‌న పోలింగ్‌…14‌న వోట్ల లెక్కింపు

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలో 12, ఎపిలో 11 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 16న నోటిఫికేషన్‌ ‌విడుదల కానుంది. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు అధికారులు గడువు ఇచ్చారు. డిసెంబర్‌ 10‌న పోలింగ్‌ ‌నిర్వహించి 14 న వోట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కు షెడ్యూల్‌ ‌విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వొచ్చింది. సభలు, సమావేశాలకు నిషేధం ఉంటుంది. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకుగాను ఆదిలాబాద్‌, ‌వరంగల్‌, ‌నల్లగొండ, మెదక్‌ , ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. అలాగే కరీంనగర్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వీటన్నింటికీ కలిపి నవంబర్‌ 16‌న నోటిఫికేషన్‌ ‌విడుదలవనుంది. వొచ్చే ఏడాది జనవరి 4వ తేదీన పలువురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది.

Leave a Reply