Take a fresh look at your lifestyle.

అక్కడక్కడా ఉదయం మళ్లీ వర్షం..

  • నగరాన్ని వదలని వానలు
  • అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

‌రాజధాని హైదరాబాద్‌ను వానలు వదలడం లేదు. గత మంగళవారం కాళరాత్రిగా మిగిల్చిన వానలు ఈ మంగళవారంతో పాటు బుధవారం కూడా భయపెట్టాయి. మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అలాగే బుధవారం ఉదయం కూడా పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పటికే వందలాది కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.  కొద్దిగా తెరిపినిచ్చిన  వాన మళ్లీ విరుచుకుపడింది. మంగళవారం నుంచి  బుధవారం ఉదయం వరకు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో వర్షం పడింది. ఎప్పటిలాగే ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరద నుంచి కాస్త తేరుకుంటున్న కాలనీల్లోకి మళ్లీ నీళ్లొచ్చాయి. ఇప్పటికే వరదలో ఉన్న కాలనీలు మరింత మునిగాయి. చాలాచోట్ల ఇళ్లలో మోకాలిలోతులో నీళ్లు నిలిచాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్, ‌మాదాపూర్‌, ‌బంజారాహిల్స్, అవి•ర్‌పేట, ఉప్పల్‌, ‌రామంతాపూర్‌, ‌చార్మినార్‌, ‌మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, చందానగర్‌, అల్వాల్‌, ‌ఫీర్జాదిగూడ, మల్కాజిగిరి, నేరెడ్‌మెట్‌, ‌జవహర్‌నగర్‌, ‌సఫిల్‌గూడ, కంచన్‌బాగ్‌, ‌శంషాబాద్‌, ‌తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

ఇప్పటికే వరద ముంపులో చిక్కుకుపోయిన ప్రాంతాల పరిస్థితి దారుణంగా తయారైంది. సరూర్‌నగర్‌ ‌మండలంలోని కోదండరాంనగర్‌, ‌సీసల బస్తీ, శారదనగర్‌, ‌కమలానగర్‌, ఉప్పల్‌, ‌ఫీర్జాదిగూడ, మేడిపల్లి, టోలీచౌకీలోని నదీంకాలనీ, పాతబస్తీలోని అరుంధతికాలనీ, శివాజీనగర్‌, ‌క్రాంతినగర్‌, ‌సాయిబాబానగర్‌, ‌రాజీవ్‌గాంధీనగర్‌, ‌ఛత్రినాక, లిమ్రాకాలనీ, సాదత్‌కాలనీ, ఆల్‌ ‌జుబైల్‌కాలనీ, హశమాబాద్‌, అలీనగర్‌లో మళ్లీ వరదనీరు చేరింది. ఇదిలావుంటే ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధుల భయం వెన్నాడుతోంది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్టపికే పలుచోట్ల బ్లీచింగ్‌ ‌చల్లి, క్లోరోక్విన్‌ ‌మాత్రలు అందచేశారు. 70 శాతం మంది ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు హెల్పింగ్‌ ‌హ్యాండ్‌ ‌ఫౌండేషన్‌ ‌నిర్వహించిన సర్వేలో తేలింది. ఇటీవల పాతనగరంలో 300 మందిని సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. వారందించిన వివరాల ప్రకారం 70 శాతం మంది దురదతో కూడిన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, 10 శాతం మంది జ్వరం, ఒళ్లు నొప్పులతో, మరో 20 శాతం మంది నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందన్నారు. బాధితులకు ఫీవర్‌ ‌కిట్లు, ఫీవర్‌ ‌సర్వైలెన్స్ ‌ఫార్మస్ అం‌దజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply