వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అనుమతి లేని పాఠశాలలను మూసివేయాలని దిష్టిబొమ్మ దగ్ధం

January 25, 2020

Scandal over closure of unauthorized schools

అనుమతి లేకుండా నడుపుతున్న పాఠశాలలను సీజ్‌ ‌చేయాలని ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న శ్రీచైతన్యను మూసివేయాలని డిమాండ్‌ ‌చేస్తూ శుక్రవారం యునైటెడ్‌ ‌స్టూడెంట్స్ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (యుఎస్‌ఎఫ్‌ఐ) అం‌బేద్కర్‌ ‌జంక్షన్‌లో దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాలోతు రాజునాయక్‌ ‌మాట్లాడుతూ యాజమాన్యాలు ఇచ్చే మామూలుకు అలవాటు పడి అధికారులు పాఠశాలపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదని అన్నారు. జిల్లాలో శ్రీచైతన్య కేవలం రెండు పాఠశాలలకు మాత్రమే అనుమతి తీసుకొని మిగతా పాఠశాలలు అనుమతి లేకుండా నడుపుతున్నారని ఆరోపించారు. ఈ పాఠశాలపై కలెక్టర్‌ ‌స్పందించి సమగ్ర విచారణ జరుపాలని లేనియెడల ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల్‌, ‌ప్రవీణ్‌, ‌శివ, అనుదీప్‌, ‌పూర్ణచందర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: Scandal, closure, unauthorized schools, sri chaitanya, usfi