Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మ దగ్ధం

అసెంబ్లీ ముట్ట డి చేసిన పిడిఎస్‌యూ నాయకు లపై లాఠీచార్జ్‌ని ఖండిస్తు బుధ వారం జిల్లా కేంద్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మని దగ్దం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షులు పోలేబొయిన కిరణ్‌కుమార్‌ ‌మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ‌సమావేశంలో 6.69 శాతం మాత్రమే పెట్టడం అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడమే అని అన్నారు. విద్యా రంగానికి కొటరి కమీషన్‌ ‌నివే దిక ద్వారా 30శాతం కేటా యించవలసి ఉండగా 6.69 శాతం కేటాయించి పేద, బడుగు బలహీన విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అన్నారు.

రాష్ట్రంలో 2లక్షల 54వేల 376టీచర్‌ ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11వేల అదనపు తరగతి గదులు, 2వేల పాఠశాలలు, త్రాగునీరు, ప్రహారీ గోడలు లేవన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన 959గురుకులాలకు కేవలం 50వరకు మాత్రమే సొంతభవనాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. అరెస్టు చేసిన పిడిఎస్‌యూ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో గౌతమ్‌, ‌మందాడి శ్రీధర్‌, ‌పడిదాల మురళీ, మోహన్‌, ‌తిరుమలేష్‌, ‌మహేష్‌, ‌కృష్ణమూర్తి, మధుసుదన్‌, ‌రాజు, సురేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply