Take a fresh look at your lifestyle.

ఘనంగా సావిత్రిబాయిపూలే జన్మదిన వేడుకలు

Savitribaipoole Birthday Celebrations in Mg road
సూర్యాపేట : చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌: ‌సామాజిక విప్లవకారిని, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 189వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల మహత్మా జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో పాటు బిసి సంక్షేమ సంఘం, డివైఎఫ్‌ఐ, ‌స్వచ్చంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు, పూలమాల లు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్బంగా  మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో విద్య ఉద్యమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని కొనియాడారు. అదే విధంగా  బడుగు, బలహీనవర్గాల స్త్రీ విద్య వ్యాప్తికి కృషి చేశారని పేర్కోన్నా రు. కార్యక్రమంలో జడ్పి వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకట నారాయణగౌడ్‌, ‌మాజీ మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌గండూరి ప్రవళికప్రకాష్‌; ‌బిసి సంఘం జిల్లా కన్వీనర్‌ ‌సవంత సత్యనారాయణపిళ్లే, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌,‌మాజీ మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌వై. వెంకటేశ్వర్లు, లయన్స్‌క్లబ్‌ అద్యక్షులు గండూరి కృపాకర్‌, ‌పెద్దిరెడ్డి రాజా, ఉప్పల ఆనంద్‌ ‌నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో…
ఖమ్మం, జనవరి 3( ప్రజాతంత్రవిలేకరి) :భారతదేశం లో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే స్త్రీ విద్యకు ఆధ్యురాలని ఆమె చదువుల తల్లిగా వర్ధిల్లుతుందని ది తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అన్నా రు. శుక్రవార ఖమ్మం నగరంలోనిప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాలలో సావిత్రిభాయి పూలే 189వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించా రు. సావిత్రి భాయిపూలే స్పూర్తితో మహిళలు, విద్యార్ధిను లు కుల, మత, మూఢ విశ్వాసాలపై పోరాడల న్నారు. తొలుత సావిత్రిభాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ‌కేఎస్‌పి రాయ్‌,‌జూనియర్‌ ‌లెక్చరర్ల సంఘ: జిల్లా కార్యద ర్శి విజయలక్ష్మి,బహుజన విద్యార్ధి సంఘం నాయకులు ఏపూరి నాగేశ్వరరావు,నాగరాజు,సీనియర్‌ అధ్యాపకులు అజీజ్‌భేగ్‌, ‌విద్యార్ధినులు,సిబ్బంది తదితరులు ఉన్నారు.

టీజేఏసి ఆధ్వర్యంలో…
సావిత్రీబాయి పూలే 189వ జయంతి వేడుకలను శుక్రవారం తెలంగాణ జాయింట్‌ ‌యాక్షన్‌కమిటి ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్‌ అం‌డ్‌ ‌బి అతిధి గృహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిసి జిల్లా కన్వీనర్‌ ‌వై వినయ్‌కుమార్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్బంగా టిజెఎసి జిల్లా చైర్మన్‌ ‌చిర్రా రవి, జిల్లా కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌కెవి కృష్ణారావులు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీభాయిపూలే అని చెప్పారు. సావిత్రీబాయిపూలే ఆశయసాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా కోకన్వీనర్‌ ‌పాల్వంచ రామారావు, పిండి పోలు రామ్మూర్తి, బాసాటి హన్మంతరావు, బిచ్చాల అన్వేష్‌, ‌దాసరి శ్రీనివాస్‌, ‌వీరస్వామి,లిక్కి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: Savitribaipoole, Birthday, Celebrations, Mg road, tjac, 189th birthday

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply