Take a fresh look at your lifestyle.

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే

సాహసోపేత జీవితం స్త్రీల జీవితాలకు అక్షరదీపమై వెలిగిన భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం ఆమె.  సామాజిక విప్లవకారుడిగా పేరొందిన మహాత్మ జ్యోతిరావు పూలే భార్య ఆమె. భర్తకు తగ్గ భార్యగా సావిత్రిబాయి పూలే  ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు.  మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ, అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు  పాఠశాలలు ప్రారంభించిన ధీశాలి ఆమె. తన ప్రసంగాలద్వారా మహిళలకెన్దరికో స్ఫూర్తి కల్పించిన విప్లవ మాతృమూర్తి. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కారిణి.
చాలామంది మేధావులకు సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా తెలుసు. ఆమె ఆధునిక భారతదేశంలో మొదటి  ఉపాధ్యాయురాలు.  స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప రచయిత్రి.  వక్త.. కులం, పితృస్వామ్యంపై  యుద్ధం నడిపిన కవయిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు అని, అందుకే అందరూ చదవాలి అని నిత్యం తపించిందామె.
భర్తకు తోడునీడగా నడవడమే కాక, స్వయంగా  సామాజిక విప్లవమూర్తి.  అవరోధాలను అధిగమిస్తూ సృజనశీలిగా ఎదిగిన నాయకురాలు. విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అనేక ఉద్యమాలు నడిపారు. వితంతువులకు వివాహాలు నిర్వహించారు. సమాజంలో దళిత బహుజనులు అక్షరాలు కూడా నేర్చుకోలేని అంధకార యుగంలో  ఒక ‘‘వేగుచుక్కలా ‘‘ సావిత్రిబాయి
మహారాష్ట్ర దగ్గర్లోని సతారా జిల్లా నయాగావ్‌ ‌లో 1831 జనవరి 3న జన్మించింది. తొమ్మిదేండ్ల వయస్సులో జ్యోతిరావుపూలేను వివాహ మాడింది. సావిత్రిబాయికి భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఆమెకు చదువు నేర్పి సామాజిక  ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. 1847లో నిమ్నకులాల బాలికలకోసం పూనేలో మొదట పాఠశాల ప్రారంభించారు. ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురైనా,   ధైర్యంగా ‘నా విధి  నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. పట్టువీడక సాగించిన  ఉద్యమానికి తక్కువ కాలంలోనే  గుర్తింపు లభించింది.పలువురు ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. అక్రమ సంతానంగా పుట్టిన బిడ్డల్నే తన బిడ్డలుగా చేసుకుంది. 1852లో మహిళా సేవ మండల్‌   ‌మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు.
1874లో ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఆ బిడ్డకు యశ్వంత్‌ అనే పేరుపెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్‌ను చేశారు. 1873లోనే సత్యశోధక్‌ ‌సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు జరిపించారు.

- Advertisement -

భార్య కోల్పోయిన ఒక యువకుడికి స్నేహితురాలి బిడ్డతో పెండ్లి చేశారు సావిత్రిబాయి. పురోహితుడు
నరేష్‌ ‌జాటోత్‌. ఎంఏ .‌బీఈడీ.కాకతీయ విశ్వవిద్యాలయం(8247887267)లేకుండా  వివాహం జరపడం చరిత్రలోనే మొదటిసారి. సావిత్రిబాయి  వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకితమైంది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో  తానే చితి అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది.  1896-97లో తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితుల్లో  జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు.
ప్లేగువ్యాధి సోకిన పేదలకు సేవలందించారు. ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించింది. 1897 మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన జానపద కళలు, ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో ప్వాన్‌కాశీ సుభోధ్‌ ‌రత్నాకర్‌ 11 ‌పేరిట కవితా సంపుటి ప్రచురించారు.  మూఢ విశ్వాసాలు ఆచరించినంత కాలం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పురాదని గుర్తించి హేతుబద్దత కవితల్లో ప్రతిబించించేవారు.  సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.
నరేష్‌ ‌జాటోత్‌. ఎంఏ .‌బీఈడీ.కాకతీయ విశ్వవిద్యాలయం(8247887267)

Leave a Reply