Take a fresh look at your lifestyle.

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన పివి నర్సింహారావు

“పివిగా ప్రసిద్ధుడై  అపరచాణుక్యుడిగా దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆధునిక రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉన్నా, ప్రధానిగా పని చేసిన ఐదేళ్ల కాలం ఇవాళ ప్రపంచం ముందు భారత్‌ను తలెత్తుకుని నిలుచునేలా చేసింది ఆయన దార్శనికతే. ఆయన   ఆర్థిక సంస్కరణలు దేశ పురోగతికి పునాదిగా నిలిచాయి. ప్రపంచ దేశాల్లో ఇవాళ భారత ప్రజలు గర్వంగా నిలుచున్నారంటే అందుకు  పివి వేసిన పునాదే కారణమనడంలో సందేహానికి ఇసుమంతైనా తావులేదు. భారతీయాత్మకు నిలువుటట్దందగా నిలిచిన మహా మనిషి మన పీవీ.”

  • ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు
  • మైనార్టీతో ఐదేళ్ళు ప్రధానిగా దేశాన్ని పాలించారు
  • కాంగ్రెస్‌ను కూడా కాపాడిన పివి సేవలు విస్మరించరాదు

ధర్మానికి కట్టుబడి రాజ్యం ఏలడమన్నది కష్టంగా ఉన్న రోజుల్లో నిజాయితీగా ఐదేళ్లపాటు భారత రథ చక్రాలను నడిపించిన ఓ గొప్ప సారథి, కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గట్టేక్కెంచేందుకు నూతన ఆర్థిక సంస్కరణలకు భారత ప్రధానిగా పివి నర్సింహరావు శ్రీకారం చుట్టారు. 1991లో రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమై ఢిల్లీ నుంచి మొత్తం తన సామానుతో స్వరాష్ట్రమైన హైదరాబాద్‌కు బయలుదేరేందుకు పివి నర్సింహరావు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే అప్పటి కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ ‌గాంధీ దుర్మరణం చెందారు. అప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అప్పుడు తటస్థుడుగా ఉన్న పివి నర్సింహారావుని ప్రధానిగా కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ ఎన్నుకుంది. మిత్ర పక్షాల సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఐదేళ్ళపాటు నడిపించారు. అటు ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్‌ ‌పార్టీని ఆయన బతికించాడు అనడంలో ఎంత మాత్రం అతియోశక్తి కాదు. పివిగా ప్రసిద్ధుడై అపరచాణుక్యుడిగా దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆధునిక రాజకీయాల్లో సుదీర్ఘ కాలం ఉన్నా, ప్రధానిగా పని చేసిన ఐదేళ్ల కాలం ఇవాళ ప్రపంచం ముందు భారత్‌ను తలెత్తుకుని నిలుచునేలా చేసింది ఆయన దార్శనికతే. ఆయన ఆర్థిక సంస్కరణలు దేశ పురోగతికి పునాదిగా నిలిచాయి. ప్రపంచ దేశాల్లో ఇవాళ భారత ప్రజలు గర్వంగా నిలుచున్నారంటే అందుకు పివి వేసిన పునాదే కారణమనడంలో సందేహానికి ఇసుమంతైనా తావులేదు. భారతీయాత్మకు నిలువుటట్దందగా నిలిచిన మహా మనిషి మన పీవీ. స్థిత ప్రజ్ఞత కలిగిన నాయకులు అరుదుగా ఉంటారు.

అపర మేధావిగా పేరుగడించిన పివి మహాపండితుడు కూడా. 18 భాషల్లో ప్రావీణ్యం ఉన్న పివి నరసింహరావు, మనిషిగా చేసిన ప్రతి పనీ దేశ ఔన్నత్యాన్నీ, పురోగతినీ పెంచేదిగానే ఉంది. గాంధీ కుటుంబేతర వ్యక్తి, ప్రధానిగా ఐదేళ్లు అదీ మైనారిటీ ప్రభుత్వాన్ని నడపడం పివితోనే ఆరంభం. ఐదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నా రాజకీయ వారసత్వం సరికాదని నిష్కర్షగా చెప్పిన మహానుభావుడు. రాజనీతిజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం పీవీ. తెలంగాణ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు ఇలా ఎన్ని విశేషణాలు చెప్పినా అవన్నీ పీవీ వ్యక్తిత్వం ముందు చంద్రుడికి నూలుపోగుగానే మిగిలిపోతాయి. దక్షిణాది నుంచి తొలి ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహరావు, దివాళా స్థితిలో ఉన్న దేశాన్ని ప్రగతి పరుగులు పెట్టించారు. అయితే ఆయన ప్రతిభను, సమర్థతను ఆయన జీవిత కాలం సేవ చేసిన కాంగ్రస్‌ ‌పార్టీ గుర్తించలేదు సరికదా కదా అవమానించింది. గాందీ కుటుంబాన్ని దిక్కరించిన వ్యక్తిగా ఆయనపై అపోహలు పెంచుకుంది. ఆయన భౌతిక కాయాన్ని కనీసం అఖిల భారత కాంగ్రెస్‌ ‌కార్యాలయ ఆవరణలోనికి కూడా అనుమతించ లేదు. ఆపద్ధర్మ ప్రధానులుగా ఉన్న వారికి కూడా హస్తినలో ఘాట్‌ ‌లు ఉంటే… ఐదేళ్ల పాటు ప్రధానిగా దేశ గౌరవాన్నీ, ప్రతిష్టను ఇనుమడింప చేసిన పివికి మాత్రం ఘనత వహించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఆ గౌరవం ఇవ్వలేదు. అయితే మన తెలంగాణ ముద్దుబిడ్డను… రాజకీయంగా కాంగ్రెస్‌తో విభేదించే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించింది. సామాన్యుడిగా ఆరంభించి అసామాన్యుడిగా మారిన అసామాన్యుడిగా ఎదిగిన పీవీ కీర్తి చరిత్రలో చీరకాలం నిలిచేలా, ఆయన స్మృతులను పదిల పర్చుకునేలా కెసిఆర్‌ ‌ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇది ముదావహం. దేశంలో తొలి నుంచీ ఉత్తరాది ఆదిపత్యం కారణంగా దక్షిణాది నాయకులకు రావలసిన గుర్తింపురావడం లేదు. అయితే పివి అటువంటి వాటిని అధిగమించిన మహోన్నతుడు. కాంగ్రెస్‌ ‌గుర్తించకుంటేనేం… ప్రపంచ మంతా ఆయన ప్రతిభను, దార్శనికతను గుర్తించింది. కాంగ్రెస్‌లో పుట్టి, కాంగ్రెస్‌తోనే జీవితాన్ని కొనసాగించినా ఆయనకు కాంగ్రెస్‌ ఆయనకు అవమానాన్ని మాత్రమే మిగిల్చింది.

పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన రాజనీతిజ్ఞుడు. ఆయన భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కేసీఆర్‌ ‌నిర్ణయించడం పీవీకి సముచిత గౌరవం ఇవ్వడమే అవుతుంది.. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తానని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించడం పీవీ పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనంగానే చూడాల్సి ఉంటుంది. యావత్‌ ‌దేశ ప్రజలకు పీవీ గొప్పతనం చెప్పేలా జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధానమంత్రి నరేంద్రమోదీని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించాలి. ఆ ఆహ్వానాన్ని వారు మన్నించాలి. రాజకీయాలు పీవీ ఔన్నత్యం ముందు చాలా చిన్నవి. భారతదేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన.. అసాధారణ బహుముఖ ప్రజ్ఞాశీలి పివి. తెలంగాణ పోరుగడ్డ నుంచి ఎదిగిన ఆయన. నెహ్రూ వంశం తరువాత ప్రధానమంత్రి బాధ్యతను ఐదేళ్ళ పాటు నిరాటంకంగా నిర్వహించిన తొలి నేత. ప్రధానిగా, విదేశాంగశాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లోనూ ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు. అందుకే పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. స్వాతంత్య సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా సేవలందించాడు. ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సంచికలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ప్రతి మార్పులోనూ పీవీ ముద్ర ఉంది. ఆర్థిక, సాంస్కృతిక, వైజ్ణా నిక, సామాజిక మార్పు లన్నిటీకీ సాక్షీభూతంగా తన దైన ముద్ర వేసిన మ హాను భావుడు పీవీ.

Leave a Reply