Take a fresh look at your lifestyle.

వరవరరావును కాపాడండి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి లేఖ
విరసం నేత వరవరరావును కాపాడాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని లేఖలో పేర్కొన్నారు. 81 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయచూపాలని కోరారు. 53 సంవత్సరాలుగా అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవాన్ని… మంచం పట్టిన వృద్ధుడు సాధించగలడా… ఈ స్థితిలో ఆయనను ఇంకా నిర్బంధంలో ఉంచటం అవసరమా? అని ప్రశ్నించారు. వరవరరావు విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆయనను కాపాడాలని కరుణాకర్‌రెడ్డి కోరారు.

వరవరరావును వెంటనే విడుదల చేయాలి : కొమ్మిడి
ఇరవై నెలలుగా జైలులో ఉన్న విరసం నేత వరవరరావుకు కరోనా సోకినందున వెంటనే బెయిల్‌ ‌మంజూరు చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ ‌చేస్తూ భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సంహ్మ రెడ్డి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా డియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వరవరరావును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. వరవరరావు ప్రాణాలకు హాని జరిగితే కేంద్ర, మహరాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కొమ్మిడి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply