Take a fresh look at your lifestyle.

శనివారం 4298  ..సోమవారం 3961 …

తెలంగాణలో తగ్గుతున్న కొరోనా కేసులు  

హైదరాబాద్,మే 17:తెలంగాణలో కొరోనా కేసులు రోజు రోజుకు స్వల్పంగా తగ్గు ముఖం పడుతున్నాయి. సోమవారం 3961పాజిటివ్ కేసులు  నమోదు అయినట్లు ప్రభుత్వ ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రోజువారి కేసులు నాలుగున్నర వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి. . అలాగే కొరోనాతో 30 మంది మృతి చెందారు.. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 5.32 లక్షల కొరోనా కేసులు నమోదవగా.. 2985 మంది మృతి చెందారు.

తెలంగాణలో ప్రస్తుతం 49,341 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొత్తగా 631 కొరోనా కేసులు నమోదవగా.. రంగారెడ్డి 257,, మేడ్చల్‌ 258, ‌నల్గొండ జిల్లాలో 138 కేసులు, వరంగల్‌ అర్బన్‌ 141,కరీంనగర్‌ ‌జిల్లాలో 160 కేసులు, నాగర్‌కర్నూలు 149, సిద్దిపేట 118, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో 135 కేసులు నమోదయ్యాయి.

Leave a Reply