Take a fresh look at your lifestyle.

కుప్ప కూలిన సర్వాయి పాపన్న కోట…….

 గోల్కొండ కోటను జయించిన తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట కుప్పకూలింది. ఆయన స్వస్థలం అయిన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్ గ్రామంలోని కోట ఇటీవలి వర్షాలకు బీటలు వారింది. గురువారం ఉదయం కూలి పోయింది. అదృష్ట వశాత్తూ ఎవరికి ప్రమాదం జరగలేదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా మన చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 6 ఏళ్ల నుంచి ఒక్క్కరు కూడా కోట నిర్వహణను పట్టించుకోలేదు అన్నారు. 350 ఏళ్ల నాటి కోట కూలడంతో తో గ్రామస్తులు జిల్లా వాసులు చింతి స్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply