Take a fresh look at your lifestyle.

పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్‌ ‌సునీత రమేష్‌

‌తాండూరు, జూలై 20, (ప్రజాతంత్ర విలేఖరి) : మంచిర్యాల జిల్లా తాండూర్‌ ‌మండలం నిలయపల్లె గ్రామ పంచాయితీలో సోమవారం పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ ‌సునీత రమేష్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో వాడ వాడల బ్లీచింగ్‌ ‌పౌడర్‌ ‌చల్లించారు. ఈ సందర్భంగా సునీత రమేష్‌ ‌మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఏలాంటి అంటూ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా రోడ్డుకు ఇరుపక్కలా, మురుగు కాల్వల వెంట పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు.

అలాగే ఇంటి పరసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కరోనా వ్యాధిన పడకుండా అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకి వెళ్లాలని ప్రతి ఒక్కరూ మాస్కులు సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!