Take a fresh look at your lifestyle.

బెల్టు షాపులు తీసివేయాలని సర్పంచ్‌కు వినతి

మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపా లెం గ్రామంలో బెల్టుషాపులు తీసివేయాలని గ్రామ మహిళలు సర్పంచ్‌ ‌భూక్యా శ్రావణికి సోమవారం వినతపత్రాన్ని అందచేసారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా వీధికో బెల్టుషాపు పెట్టి మద్యం అమ్ముతున్నారని దాని వలన గ్రామ మహిళలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. మద్యం విచ్చలవిడిగా వినియోగిం చటం వలన మా సంపదలు నిర్వీర్యం అయి గ్రామ ప్రజలు తాగుడుకు బానిసలై సోమరిపోతుల్లా తయారవుతున్నారని అన్నారు.

గ్రామంలో మద్యం అమ్మకాల వలన మా కుటుంబాలు చిందరవదనమై కాకుండా ఆర్ధికంగా కూడ చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని తెలిపారు. చిన్నపిల్లలు కూడ మద్యానికి బానిసలై వారి భవిష్యత్తు పాడుచేసుకుంటున్నారని అన్నారు. మా జీవితాలు ఎలాగో నాశనం అయ్యాయని కనీసం మా పిల్లల జీవితాలైన బాగుపడాలంటే గ్రామంలో బెల్టు షాపులను పూర్తిగా నిర్మూళించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy