- బొమ్మల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం
- టాయ్ ఇండియా ఫెయిర్‌లో ప్రధాని మోడీ
- భక్తి ఉద్యమానికి సంత్ రవిదాస్ విశేష కృషి: నివాళి అర్పించిన ప్రధాని
భారతీయుల సైకాలజీ, జీవావరణానికి తగినట్లు బొమ్మలను తయారు చేయాలని ప్రధాని మోదీ బొమ్మల ఉత్పత్తిదారులను కోరారు. సాధ్యమైనంత వరకు బొమ్మల తయారీలో ప్లాస్టిక్‌ను తగ్గించాలని, రీసైక్లింగ్‌కు అనువైన పదార్థాలను వాడాలని ఆయన సూచించారు. బొమ్మల పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇండియా టాయ్ ఫెయిర్ 2021ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సందర్బంగా వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడుతూ..భారత్‌లో బొమ్మలన్నీ దాదాపు సహజసిద్ధంగా, పర్యావరణహితమైన పదార్దాలతో తయారు అవుతాయని ప్రధాని అన్నారు. భారతీయ బొమ్మలకు వాడే రంగులన్నీ సహజమైనవని, సురక్షితమైనవని తెలిపారు. విశ్వవ్యాప్తంగా భారతీయ బొమ్మలకు డిమాండ్ ఉందని, మేడిన్ ఇండియాకు గుర్తింపు ఉన్నట్లు.. హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మలకు కూడా మార్కెట్ ఉందని మోదీ అన్నారు. జాతీయ బొమ్మల కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని,15 మంత్రిత్వశాఖలతో ఆ కార్యాచరణ ప్రణాళికను అనుసంధానం చేశామని ప్రధాని తెలిపారు.
భక్తి ఉద్యమానికి సంత్ రవిదాస్ విశేష కృషి : నివాళి అర్పించిన ప్రధాని మోడీ
భక్తి ఉద్యమ వ్యాప్తికి 15, 16 శతాబ్దాల్లో విశేషంగా కృషి చేసిన సంత్ రవిదాస్ 644వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఘనంగా నివాళులర్పించారు. సమానత్వం, సౌహార్దం, దయ వంటి ఉత్తమ గుణాలను తమ సందేశాలుగా శతాబ్దాల క్రితమే చాటిచెప్పిన ఘనత సంత్ రవిదాస్‌కు దక్కుతుందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. శతాబ్దాలుగా దేశ ప్రజలకు ఆయన సందేశాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మోదీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
భక్తి ఉద్యమానికి చెందిన సంత్ రవిదాస్ 15, 16 శతాబ్దాల్లో పాడిన పలు కీర్తనలు గురుగ్రంథ్ సాహిబ్లోనూ చోటుచేసుకున్నాయి. 21వ శతాబ్దపు రవిదాసియా మతానికి ఆయనను వ్యవస్థాపకుడిగా కూడా కొందరు భావిస్తారు. రవిదాస్ జయంతిని మాఘ పౌర్ణమి పర్వదినం నాడు జరుపుకుంటారు.