Take a fresh look at your lifestyle.

సంక్రాంతి

సంక్రాంతి సంక్రమణం
సవారి చేసే కాలగమనం!
తారా రాసులదారుల భ్రమణం
తల పోతల ఆగని గమనం!

ఉత్తరాయణం – దక్షిణాయణం
ఊరు చుట్టూ పొత్తి కట్టు!
తిరగాలోయి ఓ చుట్టూ
తప్పదోయి ఇది ఒట్టు!

భీష్మాచార్యుల నిట్టూర్పు!
మార్చలేని కాలుని తీర్పు!

ఏవి క్రాంతులు -ఏవి బ్రాంతులు!
సంక్రమణాల సంక్రాంతులు!
స్వప్నంలోని వవి బ్రాంతులు!
సంచరించే వవి క్రాంతులు !

మిన్ను జూడు- మన్ను జూడు
మిన్ను మన్నుల దన్ను చూడు
మిన్ను మన్నుల మధ్యలో డా!
మిన్నకుంటే క్రాంతి లేదు!

మనెగలిసి మసులుకుంటే
మాధవుని మహిమ వాడవు!
మార్తాండుని కాంతి వోలె
పెరిగి తరిగే వెలుగునీడవు!

సంచరించే సంక్రమణాలు
సాలు సాలుకు సంక్రాంతులు!

– పి.బక్కారెడ్డి, 9705315250

Leave a Reply