మనలోని కల్మషం అనే మురికిని
మంటల్లో కాల్చి వేస్తూ భోగితో
మొదలవుతుంది మూడురోజుల
పండగ సంక్రాంతి!
మన ఇంట చిన్న పిల్లలను రేన పండ్లతో ఆశీర్వదించేది ఈ భోగి నాడే!
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం
రైతు పండించిన పంటను ఇంటికి తెచ్చేది
ఈ సంక్రాంతి నాడే!
పడతులతో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇంటి ముంగిట
అలంకార ప్రాయం ఈ పండుగ!
అరిసెలు సకినాలు అనే పసందైన
పిండివంటలకు సొంతం ఈ పండుగ!
హరిదాసుల కీర్తనలు,
డూడూ బసవన్నల ఆటలు,
విందులు వినోదాలని ఇంటిల్లిపాదికి
సంతోషాన్ని పంచేది ఈ పండుగ!
భోగి,సంక్రాంతి,కనుమయని
మూడు రోజుల పండగ,
విశ్వమంతా నూతన కాంతిని
వెదజల్లే ముచ్చటైన పండగ!
భోగి భాగ్యాలను ఇచ్చి,
సరదాల సంక్రాంతి ని పంచి,
కమ్మని కనుమతో ముగిసే
ఆహ్లాదదైన పండగ!
ఇంటిల్లి పాది ఆనందం.,
ఊరంతా సంతోషం గొలిపే
ముచ్చటైన పండగ..యిది.
మూడు రోజుల పాటు జరిగే
పసందైన పండగ… యిది.
ఇదే మన సంక్రాంతి పండగ,
సంస్కృతి సంప్రదాయాల
మిలితమైన అద్భుతమైన
ఆనందాల సంతోషాల
మూడు రోజుల పండగ.!
ముచ్చటైన పండగ.!!
– ఎన్..రాజేష్-ఎమ్మెస్సి
(కవి,జర్నలిస్ట్-హైదరాబాద్)
9849335757