Take a fresh look at your lifestyle.

బాలవికాసలో సంక్రాంతి సంబురాలు

Sankranti celebrations in balavikash
దేశ సాంప్రదాయాలను అభినందించిన విదేశీయులు

సంక్రాంతి సందడి ముందుగానే ప్రారంభమైంది. వరంగల్‌లో విదేశీయుల ఆట పాటల మద్య సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఖాజీపేటలోని బాలవికాస స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో కెనడా, సూడాన్‌, ‌బంగ్లాదేశ్‌, ‌శ్రీలంక, నేపాల్‌ ‌దేశాలకు చెందిన సుమారు 40 మంది విదేశీయులు పాల్గొన్నారు. విదేశీ వనితలు రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను పెట్టి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. పిండి వంటలను ఆస్వాదించారు. నృత్యాలు చేస్తూ, గంగిరెద్దు విన్యాసాలు తిలకిస్తూ ఆనందంలో మునిగిపోయారు.

పంటలు ఇంటికి వచ్చిన వేళ సంక్రాంతి పండగ జరుపు కోవడం ఒక మంచి సాంప్రదాయమని సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమకు ఆనం దంగా ఉందని విదేశీ యువతీయువకులు అన్నారు. బాల వికాస వ్యవస్థపకురాలు బాలతెరిసా జింగ్రాస్‌ ‌మాట్లడుతూ ప్రతి సంవత్సరం బాలవికాస వివిధ అభివృద్ధి కార్యక్రమన్ని చూడటానికి ఎంతో మంది విధేశియులు రావటం జరుగుతుందని, వారు వచ్చినప్పుడు మన సంస్కృతిని తెలియపరిచే విధంగా వివిధ కార్యక్రమలను ఏర్పాటు చేయటం జరుగుతు ందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ ‌డైరెక్టర్‌ ‌సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి ప్రాముఖ్యతను, అది జరుపుకునే విధానాన్ని విదేశీయులకు తెలిపారు. వివిధ దేశాలనుండి వచ్చిన ప్రతినిధులు భారతదేశపు సాంప్రదా యాలు చాల కలర్‌ఫుల్‌గా ఉన్నాయని, ఎంతో అర్ధంతో కూడుకుని ఉన్నాయని, ఇటువంటి పండుగలలో తాము పాల్గొనడం చాల సంతోషంగా ఉందని, అంతేకాకుండా ముగ్గులలో కలర్స్ ‌నింపుతూ, డాన్స్‌లతో అలరించారు.

Leave a Reply